Manam emotional gaa undaala vaddaa

September 6, 2023

మనం ఎమోషనల్‌గా ఉండాలా వద్దా (పార్ట్ 1)

మలుపులు, కుదుపులతో నిండిన జీవితాన్ని జీవిస్తున్న మనకు, ఆ దృశ్యాలతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం సహజమే. ఒక్కోసారి నిరాశ, మరోసారి దుఃఖం, ఇంకోసారి ఆనందంతో నిండిన భావోద్వేగం. అన్నీ నార్మల్ ఎమోషన్లే. ఇలాగే కదా మనం ఆలోచిస్తాం! రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని చూసినప్పుడు బాధపడటంలో తప్పేముంది? భావోద్వేగాలతో నిండిన సినిమాను చూసినప్పుడు ఏడుపు రావడంలో తప్పేముంది? ఇటువంటి రెండు రకాల భావోద్వాగాలను జీవితంలో లేకుండా చేయగలమా? ఇలా ఉండటం కరెక్టే అని మనకు ప్రపంచం నేర్పించింది. మనం పెరుగుతున్నప్పుడు మనం ఎన్నోసార్లు ఏడ్చాము, అది బాధతో కావచ్చు, ఆనందంతో కావచ్చు. మీ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళి బాగా ఎమోషనల్‌గా, అతి ఆనందపడ్డారా! మీ తమ్ముడికో చెల్లెలికో బాగా జ్వరంవస్తే వారి బాధను చూడలేక ఏడ్చేసారా?  జీవితమంటే ఇదే అని మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు – భావోద్వేగ ఆనందం మరియు భావోద్వేగ దుఃఖం యొక్క మిశ్రమ ఛాయలు జీవితం యొక్క పెయింటింగ్‌ను తయారు చేస్తాయి. నిజానికి, వారు తమ ప్రాపంచిక విధులలో అలా చేయడం చూసి మనం పెరిగాము, అదే సరైనది అని మనం భావించాము. ఇప్పుడు! ఆగండి! నేను ఈ ఎమోషనల్ రోలర్ కోస్టర్‌పై పదే పదే కూర్చోవడాన్ని ఇష్టపడతానా? నన్ను నేను ఎలా విడిపించుకోగలను?

                 మనమందరం జీవితంలోని దృశ్యాలను జీవితం నుండి ఏదైనా స్వీకరించే లేదా తీసుకునే వైఖరితో చూస్తాము. జీవిత సన్నివేశాలకు ఇవ్వడం గురించి మనం చాలా అరుదుగా ఆలోచిస్తాము. ప్రకృతిలో సూర్యుని ఉదాహరణ తీసుకోండి. సూర్యుని గుణం ఇవ్వడం, అది స్వీకరించడానికి లేదా తీసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించదు. సూర్యుడు ప్రకృతిలోని శక్తివంతమైన శక్తి. మనలోని ఈ సుగుణాన్ని వెలికితీద్దాం. అది మనల్ని మానసికంగా శక్తివంతం చేస్తుంది మరియు జీవితంలోని విభిన్న పరిస్థితుల్లో మనం తేలికగా, సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటాము. కాబట్టి ఈ రోజు నుండి జీవితంలోని విభిన్న దృశ్యాలకు ఇవ్వడానికి ప్రయత్నించండి; ఆ దృశ్యాలను ప్రాథమిక సుగుణాలైన శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నింపడానికి చూడండి. అదే, ఈ గుణాలను వ్యక్తుల నుండి మరియు పరిస్థితుల నుండి తీసుకుని మనల్ని మనం నింపుకోవడానికి ప్రయత్నిస్తే మనం మానసికంగా బలహీనంగా అవుతాము.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd oct 2023 soul sustenance telugu

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు

Read More »
2nd oct 2023 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు నేను ఎలా భావిస్తున్నాను అనేది జీవితంలో పురోగతికి చాలా ముఖ్యం. అలాగే,

Read More »
1st oct 2023 soul sustenance telugu new

ఇవి ప్రపంచ నాటకం యొక్క చివరి క్షణాలు

ప్రపంచ నాటకం అనేది భూమిపై ఆత్మలందరూ ఆడే ఒక నాటకం, ఇందులో నాలుగు దశలు ఉన్నాయి – సత్యయుగం లేదా స్వర్ణయుగం, త్రేతాయుగం లేదా వెండి యుగం, ద్వాపరయుగం లేదా రాగి యుగం మరియు

Read More »