Hin

1st feb 2025 soul sustenance telugu

February 1, 2025

మనం మానవ యంత్రాలం కాదు, మానవ జీవులం (పార్ట్ 2)

మీరు రోజును ప్రారంభించినప్పుడల్లా, మీ చుట్టూ ఉన్న ప్రతిదీ మరియు ప్రతి ఒక్కరినీ చూస్తూ నా విద్య, నా వృత్తిపరమైన అర్హతలు, నా సంపద మరియు నా పాత్ర – ఇవన్నీ మరియు మరెన్నో నిజంగా నాది కాదని లోతుగా గ్రహించండి. ఎందుకంటే ముందు మీరు భౌతికం కాని శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండి ఉన్నారు.  భౌతిక వస్తువులు, వ్యక్తులు, సన్నిహిత సంబంధాలు మరియు మిగతావన్నీ, మీ భౌతిక శరీరం కూడా – ఇవన్నీ మీరు తరువాత పొందారు. భౌతికం కానిది భౌతికతను నియంత్రిస్తూ నడుపుతుంది. భౌతికం కానిది శాశ్వతమైనది మరియు భౌతికం ఈ జీవితకాలానికి మాత్రమే పరిమితం చేయబడింది.

సంతోషం అనేది మనం వెతుకుతున్న ప్రాథమిక సుగుణం. అలాగే, మనం శాంతి మరియు ప్రేమ కోసం వెతుకుతున్నాము. మీ స్మృతి భౌతికత చుట్టూ కేంద్రీకృతమై ఉన్నంత వరకు, ఈ మూడు భావోద్వేగాలను మీరు శాశ్వతంగా మరియు ఎప్పటికీ అనుభవం చేసుకోలేరు. అవి వస్తూ, పోతూ ఉంటాయి. ఎందుకంటే భౌతికమైన ప్రతిదీ తాత్కాలికమైనది మరియు మార్చుకోగలిగేది. ఒక రోజు మీ సంబంధాలు బాగుంటాయి, మరొక రోజు సహకారం లేనప్పుడు మీరు తక్కువ ప్రేమను అనుభవం చేసుకుంటారు. కొన్నిసార్లు, కార్యాలయంలో ప్రతిదీ సజావుగా జరుగుతుండగా, మరొకటి అసంపూర్ణమైన పనులు మరియు గడువుల ఒత్తిడి ఉంటుంది, ఇది మీకు శాంతిలేని అనుభూతిని కలిగిస్తుంది. అలాగే, కొన్నిసార్లు మీ శారీరక వస్త్రం లేదా శరీరం ఆరోగ్యంగా, బాగా నడుస్తుంది. అకస్మాత్తుగా ఒక అనారోగ్యం తలెత్తినప్పుడు మీరు మీ అంతర్గత సంతృప్తిని మరియు ఆరోగ్య అనుభూతిని కోల్పోతారు. కాబట్టి, జీవితం మలుపులతో కూడినది. మీ స్మృతి మీ అంతర్గతమైన దానిపై కేంద్రీకృతమైనప్పుడు, మీరు సదా శాంతియుతంగా, ప్రేమగా మరియు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీ శాంతి, ప్రేమ, సంతోషానికి పునాది శాశ్వతమైనది మరియు మార్చలేనిది. అలాగే, మీ ఉనికికి, అనాది అంతర్గత స్వయాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు మీరు బయటి పరిస్థితులకు ప్రభావితం కాలేరు. అవి వస్తూ పోతూ ఉంటాయి కానీ మీరు స్థిరంగా ఉంటారు, ఎందుకంటే మీరు శాంతి, ప్రేమ, సంతోషాలకు మూలం. మీరు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని వాటితో నింపుతారు. 

ఇకపై వాటికోసం మీకు పరిస్థితులు మూలం కాదు. శాంతి, ప్రేమ, సంతోషాలతో నిండి ఉండటానికి మీరు ఇకపై పరిస్థితుల మీద ఆధారపడరు.

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »