Hin

26th jan 2024 soul sustenance telugu

January 26, 2024

మనం మారితే ఇతరులు మారతారు (పార్ట్ 1)

జీవితంలో వివిధ సంబంధాలు వివిధ రకాల సవాళ్లను తెస్తాయి.  ఇతరుల నుండి మనం ఆశించేది పొందనప్పుడు సంబంధాలు మన మానసిక శక్తికి పరీక్షగా మారతాయి. ఇతరుల అంచనాలు కొన్నిసార్లు మనపై చాలా భారాన్ని మోపుతాయి, కొన్నిసార్లు వ్యక్తులతో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఉహించని విధంగా  జీవితంపై ఆసక్తిని కోల్పోవచ్చు, ఒకప్పుడు ఒక రాజు చాలా పెద్ద రాజ్యాన్ని పాలించేవాడు. ఆ రాజ్యంలో   వివిధ రకాల వ్యక్తులు ఉండేవారు. వారు తమ పాత్రలలో మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాలలో, సంస్కారాలలో కూడా చాలా భిన్నంగా ఉండేవారు. వారందరూ రాజు నుండి రకరకాలుగా ఆశించేవారు. వారందరినీ సంతుష్టపరచలేక పోతున్నానని రాజు ఆలోచించే వాడు. అలాగే, రాజ్యంలోని ప్రజల నుండి అతను చాలా ఆశించేవాడు. కొన్నిసార్లు వారి ఆందోళనలు మరియు డిమాండ్లను నిర్వహించేటప్పుడు శాంతి మరియు అంతర్గత స్థిరత్వాన్ని కోల్పోయేవాడు. అందరి కోరికలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించే బదులు, మీరు మంచి వ్యక్తిగా ఉంటూ మీ పాత్రను సాధ్యమైనంత ఉత్తమంగా పోషించడంపై దృష్టి పెట్టండి. మిగిలినవి జరిగినట్లు జరగనివ్వమని రాజు యొక్క మంత్రి అతనికి సలహా ఇచ్చాడు.

మనం ఇతరులను మార్చడానికి ప్రయత్నించడం కాదు, మనల్ని మనం మార్చుకోవడం సానుకూల ఫలితాలను తెస్తుంది. ఎందుకంటే మీ మార్పు ఇతరులను మార్చడానికి ప్రేరేపిస్తుంది. ప్రతి ఒక్కరూ మనకు కావలసిన విధంగా ప్రవర్తించరని గుర్తుంచుకోండి మరియు కొన్నిసార్లు దీనిని ఎదుర్కోవడం కష్టం. కానీ మనం మన సానుకూల ప్రవర్తన మరియు మార్పులో దృఢంగా ఉంటే, వారు మన మార్పును చూసిన తర్వాత, కొంత కాలానికి, వారి తప్పులను గుర్తించడం ప్రారంభిస్తారు. మీరు ఆశించిన విధంగా మారతారు.

(సశేషం… )

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »