Hin

27th jan 2024 soul sustenance telugu

January 27, 2024

మనం మారితే ఇతరులు మారతారు (పార్ట్ 2)

విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులను సంభాళించడానికి చాలా ఆధ్యాత్మిక శక్తి  అవసరం. కొందరికి అది సాధించడం చాలా కష్టమైన విషయం. ఇది కేవలం నైపుణ్యాల అంటే మనం మాట్లాడే విధానం, మనల్ని మనం ప్రదర్శించుకోవటం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం గురించి మాత్రమే కాదు. కానీ దానికంటే గుణాలు, శక్తులు మరియు మనం చేసే వివిధ కర్మల ఫలితాల జ్ఞానాన్ని తెలుసుకోవటం ముఖ్యం.

ఉదాహరణకు, మీరు ఇతర కార్యాలయ సహోద్యోగులతో సమావేశానికి సిద్ధమవుతున్నట్లయితే, భౌతిక స్థాయిలో కొన్ని ఏర్పాట్లను చూసుకుంటారు – చర్చించడానికి కంపెనీ ఎజెండాలో ఉన్న వాటిని చూడటం, మీ సమూహంలోని విభిన్న ఫిర్యాదులు ఏమిటి, కంపెనీ ఎక్కడ లోపించింది మరియు అందరూ నాతో సంతృప్తి చెందడానికి నా బాహ్య వ్యక్తిత్వం ఎంత ఉత్తమంగా ఉండాలి వంటి విషయాలు. కానీ నా అంతర్గత వ్యక్తిత్వం ఎలా ఉందో అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? నేను మంచి స్వభావం కలిగి ఉన్నానా, నా ప్రేమ మరియు శుభభావనతో  అందరి మనసులోని కోరికలను తీర్చగలనా? అలాగే, ప్రతి ఒక్కరి ప్రవర్తన, పని చేసే విధానం నా కంటే భిన్నంగా ఉన్నప్పటికీ నేను తట్టుకోగలిగేలా ఆధ్యాత్మికంగా నన్ను నేను శక్తివంతం చేసుకున్నానా? లేదంటే, విభిన్న వ్యక్తిత్వాలు, ఉద్దేశ్యాలు లక్ష్యాలు మనల్ని కలవరపెడతాయి . అలాగే, ఆ దృష్టిపెట్టలేని మానసిక స్థితి మనల్ని సానుకూలంగా వ్యవహరించనివ్వదు మరియు మన నిర్ణయాలు తప్పవచ్చు. వాస్తవానికి, వ్యక్తులతో వ్యవహరించడం ఎల్లప్పుడూ సులభం కాదు మరియు వారిని సంతోషపెట్టడానికి మనం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలం కావచ్చు. కానీ, సంబంధాలలో సామరస్యాన్ని తీసుకురావడానికి, మనకు మంచి నిర్ణయ శక్తి, విచక్షణ శక్తి, మలచుకొనే సామర్థ్యం, అంగీకరించే శక్తి మరియు ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించే సామర్థ్యం మొదలైన ఆధ్యాత్మిక నైపుణ్యాలు కూడా ఉండాలి. ఇవన్నీ విజయం పొందడానికి సులభం చేస్తాయి.

(సశేషం… )

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »
14th june2024 soul sustenance telugu

వినయంగా ఉంటూ ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వండి

ప్రతి సమాజం మరియు ప్రతి కుటుంబం కూడా ప్రవర్తనలో కొన్ని నియమాలను పాటిస్తుంది. వ్యక్తుల పాత్రలు, పదవుల ఆధారంగా వారిని గౌరవించడానికి ఆ నియమాలు మనకు ప్రవర్తనా నియమావళిగా పనిచేస్తాయి. నిర్దిష్ట పాత్రలలో ఉన్న

Read More »
13th june2024 soul sustenance telugu

సంతోషాన్ని సరిగ్గా జీవించడం (పార్ట్ 3)

సంతోషం అనేది బాహ్య ప్రభావాలపై ఆధారపడినది మానసిక స్థితి. ఉదా. మీరు ఒక గొప్ప వార్త వింటారు – మీ కార్యాలయంలో మీకు ప్రమోషన్ వచ్చింది. ఇది వినడానికి చాలా బాగుంటుంది, మీకు సంతోషాన్ని

Read More »