Hin

28th jan 2024 soul sustenance telugu

January 28, 2024

మనం మారితే ఇతరులు మారతారు (పార్ట్ 3)

మన మనసు కర్మలు చేస్తూ కూడా శాంతి, ప్రేమ, ఆనందాలకు నిలయమైన అంతరాత్మతో, ఆ ఆత్మ స్మృతితో ఉండాలని గుర్తుంచుకోండి. అలాగే, మీ జీవితంలో ప్రతి అడుగులోనూ భగవంతుని లేదా ఉన్నతమైన శక్తి యొక్క ఉనికిని అనుభూతి చెందండి. వారు లేకుండా మన పనులలో, ప్రత్యేకించి మన సంబంధాలు మరియు పరస్పర చర్యలలో విజయం సాధించలేము. ఆత్మ మరియు భగవంతుడి ఇరువురి నుండి శక్తులు మన సంబంధాలలో అవసరం. కాబట్టి, మీ ప్రవర్తనతో, మీరు వారితో పంచుకునే శక్తి ద్వారా ఇతరులను సంతృప్తి పరచడమనేది మీలో సానుకూల శక్తి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

 

మీరు ఇతరుల ఆలోచనలను మీ ఆలోచనా విధానానికి  మార్చవచ్చు , మీరు అనుకున్న విధంగా వారు పని చేసేలా సాధ్యమైనంతా ప్రయతించవచ్చు. కానీ, మంచితనంతో నిండిన మీ ఒక్క చర్య ఇతర పద్ధతుల ద్వారా ప్రయత్నించిన దానికన్నా చాలా వేగంగా సాధించగలదు. ఉదాహరణకు, మీ కుటుంబంలోని ఒక వ్యక్తి నిరంతరం మీకు అవిధేయత చూపడం, మీ అభ్యర్థనలకు వ్యతిరేకంగా వెళ్లే అలవాటును కలిగి ఉంటే, వారు మీతో సత్సంబంధాలు కలిగి ఉండరు. మీతో అభిప్రాయ భేదాలకు ఎల్లప్పుడూ కారణాన్ని చూస్తారు. మీరు ఈ వ్యక్తితో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ఎంతో కాలం  ప్రయత్నించినా మీరు విజయవంతం కాలేదు. ఇప్పుడు, మిమ్మల్ని మీరు మధురంగా, మరింత సహనం గల వ్యక్తిగా మార్చుకుంటారు. మిమ్మల్ని మీరు మరింత వినయంగా మార్చుకోవడానికి కృషి చేస్తారు. అకస్మాత్తుగా, మీరు ఇంత కాలం నుండి సాధించలేనిది చాలా సులభంగా కొన్ని రోజుల్లోనే  సాధిస్తారు. ఎందుకంటే మీ ఆచరణలో  మార్పును చూసి, అవతలి వ్యక్తి  ప్రేరణ పొందుతాడు. ఆ ప్రేరణ తనను తాను మార్చుకునేలా చేస్తుంది. ఇది మనం ఆ వ్యక్తిని నిరంతరం మార్పు కోసం ఒప్పించడం కంటే చాలా త్వరగా మార్పు వస్తుంది. మనం మారినప్పుడు, ఇతరులు మారతారని గుర్తుంచుకోండి. మనం మారనంత వరకు, ఇతరులను మార్చడం చాలా కష్టమైన విషయంగా మిగిలిపోతుంది, వాస్తవానికి అది అసాధ్యం కూడా. కాబట్టి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఇతరులు మిమల్ని అనుసరించడానికి ఒక ఉదాహరణగా ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »