Hin

31st jan 2025 soul sustenance telugu

January 31, 2025

మనం మానవ యంత్రాలం కాదు, మానవ జీవులం (పార్ట్ 1) 

మనమందరం ఈ ప్రపంచంలో ఉన్నత ప్రయోజనం కోసం జన్మించిన ప్రత్యేక దేవదూతలం. ఉదయం నుండి రాత్రి వరకు జీవితాన్ని గడపడం, ఉదయం తయారవ్వడం, పనికి వెళ్లడం, భోజనం వండడం మరియు రోజు చివరిలో నిద్రపోవడం వంటి పనులతో నిండి ఉండటమే కాకుండా, ఈ జీవితకాలంలో మనకు గొప్ప లక్ష్యం కూడా ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదా. కోసం మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ లాంటి యంత్రం తీసుకోండి. మనం దానిని ఆన్ చేసినప్పుడు అది నడుస్తుంది మరియు మనం ఆఫ్ చేసినప్పుడు అది ఆగిపోతుంది. అది నడవనప్పుడు, అది ఇంకేదైనా చేయగలదని ఆలోచించకుండా, ఊరకనే ఉంటుంది. దానికి అంతకంటే గొప్ప పని ఉందా? లేదు. అప్పుడు ఎదో ఒక రోజు మనం దానిని శాశ్వతంగా విస్మరించి, దానిని విడిచిపెట్టే సమయం వస్తుంది. మనమందరం మొదట మానవ జీవులం, మానవ యంత్రాలం మాత్రమే కాదు. మానవ యంత్రాలు ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తాయి, ఉన్నత ప్రయోజనం లేకుండా వివిధ చర్యలను చేస్తాయి. మానవులకు ఒక ఉన్నత లక్ష్యం ఉంది – జీవితానికి అవసరమైన చర్యలను చేస్తూ జీవి పైన ద్రుష్టి పెట్టడం. కాబట్టి, ఈ రోజు నుండి మనం ఒక యంత్రంలా ఉండకూడదు. మనం మన ఆఫీస్ లోకి అడుగుపెట్టినప్పుడు లేదా మన ఇల్లు మరియు కుటుంబాన్ని చూసుకుని, మన స్నేహితులతో సంభాషించినప్పుడు, ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి, మనతో ఏమీ తీసుకెళ్లలేమని తెలుసుకొని ఉందాం. మీరు ఈ శారీరక దుస్తులు లేదా శరీరంలో లేనప్పుడు ఆర్థిక విజయం, వృత్తిపరంగా సాధించినది, అందమైన సంబంధం, రూపం మరియు బాహ్య వ్యక్తిత్వం మీతో పాటు రావు.

 

కాబట్టి, ఈ క్షణం కాసేపు ఆగి లోలోపలికి చూసుకోండి. నేను నా కొడుకు లేదా కుమార్తె లేదా భర్త లేదా భార్యను ప్రేమిస్తున్నాను, కానీ ఏదో ఒక రోజు నేను ఈ భౌతిక వస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు వారు నాతో ఉండరు. నాకు, నా జీవిత లక్ష్యం వారిని చూసుకోవడం కావచ్చు. కానీ నా ఉన్నత ఉద్దేశ్యం నా అంతర్గత స్వభావాన్ని, నా సంస్కారాలను, నా అంతర్గత అస్తిత్వాన్ని చూసుకోవడం, వీటిని నేను నాతో పాటు తీసుకువెళతాను. కాబట్టి ప్రతి ఉదయం ఒక ధృవీకరణ తీసుకోండి – నేను రోజంతా నా అంతర్గత స్వభావాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడాన్ని మరియు నేను కలిసే ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని ఇవ్వడాన్ని ఎంచుకుంటాను. నేను పనిలో మంచిగా ఉండటాన్ని ఎంచుకుంటాను, కానీ నా చర్యలపై కూడా పని చేస్తాను, ఇది నాకు అందరి నుండి ఆశీర్వాదాలను పొందేలా చేస్తుంది. అలాగే, నేను ప్రతి ఒక్కరికీ మంచితనానికి అద్దంలా ఉండటాన్ని ఎంచుకుంటాను, దీనిలో ఇతరులు సానుకూలతను చూస్తారు మరియు మంచి మనుషులుగా మారడానికి ప్రేరణ పొందుతారు. ఎందుకు? ఎందుకంటే మీరు ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైన మానవులు, సాధారణ మానవులు కారు!

 

(సశేషం…)

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »