HI

4th dec 2023 soul sustenance telugu

December 4, 2023

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 1)

ఆధ్యాత్మిక స్థాయిలో, భారం (ప్రెషర్) అంటే మనపై పని చేసే బాహ్య శక్తిని, దానిని భరించగల లేక ఎదిరించగల మన సామర్థ్యంతో విభాగిస్తే వచ్చేదే భారం. అందువలన, శక్తి మరియు ఎదిరించగల సామర్థ్యం ఒత్తిడి సమీకరణంలో రెండు ముఖ్యమైన అంశాలు. ప్రతి ఒక్కరి ప్రతిఘటించే సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. వేర్వేరు ప్రతిఘటన సామర్థ్యాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన ఫోర్సును ఎదుర్కున్నప్పుడు వారు పొందే ఒత్తిడి స్థాయి కూడా వేరువేరుగా ఉంటుంది. భారంగా ఉంది అన్న మన భావనే మన స్వతంత్రతను తీసేసి బాహ్య సత్తా మనల్ని శాసిస్తుంది అన్న భావనను తెస్తుంది. బాహ్య ఒత్తిళ్ళు లేనప్పుడు మనసు స్వతంత్రంగా ఉండగలదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇది దాదాపు అసంభవం. ఎందుకంటే మనిషి తాను పోషించే పాత్రలో ఎప్పుడూ ఏదో ఒక రకమైన బాహ్య ఒత్తిళ్ళను, భారాలను, ఒడిదుడుకులను ఎదుర్కుంటూనే ఉంటాడు. తన శరీరం, వృత్తి, కుటుంబం, సంపద, బంధాలు మొదలైనవి కావచ్చు. తన సొంత వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనలు, భావాలు మొదలైనవి కూడా ఒక్కోసారి ఒత్తిడిని తీసుకురావచ్చు.

ఎదుర్కునే శక్తే కాకుండా, భారం సమీకరణలో మరో అంశం – మనం ఎదుర్కుంటున్న పరిస్థితిలోని సత్తాను నేను ఎలా అంచనా వేస్తున్నాను అన్నదీ ముఖ్యమే. ఇందుకు ప్రాథమికంగా మనలో ఉన్న నమ్మకాలే ఆధారము. ఇద్దరు వ్యక్తులు బాహ్య పరిస్థితి యొక్క తీవ్రతను వేరువేరు విధాలుగా లెక్కించవచ్చు. మన ఒత్తిడికి కారణం బాహ్య పరిస్థితులు, వ్యక్తులు, వారికి మనపై ఉన్న ఆపేక్షలు అని అనుకుంటే, ఒత్తిడికి గురయ్యే మన స్వభావాన్ని మార్చుకోవడం అనేది మన చేతిలోని పని కాదనిపిస్తుంది. మనల్ని మనమే ఒత్తిడికి గురి చేసుకుని, బాహ్య పరిస్థితులు ఒత్తిడికి గురి చేసేలా వెసులుబాటును ఇస్తున్నాం. మన జీవిత ప్రయాణాన్ని భావాల ఖైదులో, గందరగోళ స్థితిలో, కంగారు మరియు తొందరపాటు స్థితిలో గడపవచ్చు లేదా ఇదే ప్రయాణాన్ని ఆత్మ విశ్వాసంతో, దృఢత్వంతో, ఓర్పుతో, ఆంతరిక భావోద్వేగ స్థిరత్వంతోనూ గడపవచ్చు. ఒక్కోసారి మనమీద మనమే ఒత్తిడిని సృష్టించుకుంటాం, ఏదైనా సాధించాలంటే కొంత ఒత్తిడి ఉండటం మంచిదే; ఇది మనకు సానుకూలమైన శక్తినిచ్చి మనకు చేయాలన్న ప్రేరణను ఇస్తుంది అని కొందరు నమ్ముతారు. లేని ఒత్తిడిని జీవితంలోకి తెచ్చి, అది ఉన్నట్లుగా చూడటం అంటే ఇదే. ఇటువంటి ఒత్తిళ్ళు, భారాలు మనల్ని మోసగిస్తాయి, తాత్కాలికంగా లాభపడుతున్నామన్న భ్రమను కలిగిస్తాయి, కానీ ఇది దీర్ఘకాలంలో మనపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. కొందరికి ఇటువంటి అభిప్రాయమే ఉండదు కాబట్టి వారు తమ జీవితాలలోకి అనవసరమైన ఒత్తిళ్ళను అనుమతించరు.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »