Hin

5th dec 2023 soul sustenance telugu

December 5, 2023

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 2)

బాహ్య ఒత్తిళ్ళు లేనప్పుడే మనం స్వేచ్ఛగా ఉండగలమా? ఒత్తిడి రకరకాలుగా ఉంటుంది. పనిలో చూసుకుంటే, నిర్థారిత మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయంలో పని చేయాలని, ఇతరుల అంచనాలకు అనుగుణంగా పని చేయాలని, సహోద్యోగుల పనితీరుకు తగ్గట్లుగా మన పనితీరు ఉండాలని ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతాం. బంధాలలో అయితే, బంధాలు విజయవంతంగా ఉండాలి, ఇతరులను తృప్తిపరచాలి, ఇతరుల నుండి గౌరవం పొందాలి అని తాపత్రయపడతాం. చదువులో అయితే, బాగా చదవాలని, బాగా చదివితే భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనే కాకుండా ఇతరుల దృష్టిలో కూడా సదభిప్రాయం కలిగి ఉంటామన్న ఆలోచన. ఇంకా ఇంకా సంపాదించాలి, అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు కుటుంబానికి అందించాలి, సమాజంలో ఒక హోదా కలిగి ఉండాలి అన్న ఒత్తిడి. జీవితంలో సమస్యలు ఉంటే, వాటిని త్వరగా పరిష్కరించలేకపోయినా, మనకు తగ్గట్లుగా లేకపోయినా ఒత్తిడికి లోనవుతాం. జీవితంలో ఏ క్షేత్రంలోనైనా వైఫల్యం, అది కలిగించే భయం కూడా ఒత్తిడిని తెస్తుంది. ఒక్కోసారి మన మనసు మనం ఆశించిన రీతిలో పని చేస్తుండకపోవచ్చు, లేదా మనలోని ప్రతికూల వ్యక్తిత్వాన్ని సానుకూలంగా మార్చుకోలేకపోతుంటే కూడా ఒత్తిడి వస్తుంది. నిశ్చయించబడ్డ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోకపోతే జరిగే హానిని తలుచుకుని కూడా ఒత్తిడికి లోనవుతాం. శారీరక అనారోగ్యం, దాని వలన కలిగే భయం కూడా కొందరికి ఒత్తిడిని కలిగిస్తుంది.

ఈ విధంగా, ఒక దాని తర్వాత ఒకటిగా వచ్చే అంతులేని కష్టాల ప్రయాణంలా, స్వీడ్ బ్రేకరుగా, ప్రశాంతతకు సమయమే లేనట్లుగా జీవితం మారుతుంది. భారంగా ఉన్నప్పుడు బాహ్య కష్టాలు మనల్ని శాసిస్తున్నట్లుగా, మనకు స్వేచ్ఛ లేనట్లుగా అనిపిస్తుంది. పదే పదే ఒత్తిడికి లోనయ్యే స్వభావం ఉంటే, ఈ భారాన్ని మోస్తూ ఉంటే, దీర్ఘకాలంలో చూస్తే, ఇది, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక స్థాయిలో మనల్ని అలసటకు గురి చేస్తుంది.

 

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

సంతోషం మరియు విజయం వాస్తవానికి పరస్పరం ముడిపడి ఉంటాయి. ఆ రెండు ఒక సాధారణ అంశాన్ని పంచుకుంటాయి – వాటిని అనుసరించలేము. మనం ఆత్మిక స్థితిని అభ్యసిస్తే, విజయం మరియు సంతోషం  రెండింటినీ సాధించిన

Read More »
17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »