HI

6th dec 2023 soul sustenance telugu

December 6, 2023

మానసిక భారాలు మరియు ఒత్తిళ్ళను అధిగమించుట (పార్ట్ 3)

ఒక్కోసారి, మనమున్న వర్తమాన పరిస్థితికి సంబంధించిన ఒత్తిడి మనకు ఉంటుంది, మరి కొన్ని సార్లు ఒక పరిస్థితిలోని ఒత్తిడిని మరో పరిస్థితిలోకి తీసుకు వెళ్తుంటాం అంటే ఇది అసంబద్ధ ఒత్తిడి. ఇలా రోజంతా జరుగుతూనే ఉంటుంది, రోజూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒత్తిడి ఏమి చేస్తుందంటే, మన మనసులోని ఆలోచనల సంఖ్యను పెంచేస్తుంది, ఇది మన సమర్థతను తగ్గిస్తుంది, దీని కారణంగా మనలోని పరిశీలన మరియు నిర్ణయ శక్తులు కూడా తగ్గుతాయి. ఇటువంటి మానసిక స్థితి నుండి వచ్చే మాటలు, పనులు సక్రమంగా ఉండవు; శక్తిని, నమ్మకాన్ని, స్పష్టతను కోల్పోతాము. ఒత్తిడితో నిండిన లగేజీని మన భావోద్వేగ వీపుపై పెట్టుకుని తిరగకుండా ఉండాలంటే, మొదటి సందేశంలో చెప్పుకున్న భారం సమీకరణ (ఈక్వేషన్) ప్రకారంగా, భారానికి మూలమైన అపసవ్య నమ్మకాలను ముందుగా మనం మార్చాలి, అలాగే జీవిత పరిస్థితులను ఎదుర్కునే మన సమర్థతను కూడా పెంచుకోవాలి. విజయం వైఫల్యం, గెలుపు ఓటముల గురించి మనకున్న నమ్మకాల ఆధారంగానే మనకు ఆలోచనలు వస్తాయి. మనకున్న అటువంటి నమ్మకాలు సరైనవి కాకపోయినా వాటినే మనం సరైనవిగా నమ్ముతుంటాం. వాస్తవాలను చూసే మన దృష్టికోణాన్ని అవి ప్రభావితం చేసి మనలో ఒత్తిడి భావాలను కలిగిస్తాయి. నిజానికి, వాస్తవం అనేది మన నమ్మకాలకన్నా చాలా భిన్నంగా మరియు లోతుగా ఉంటుంది.

జీవిత పరిస్థితులను భరించాలన్నా, ఎదుర్కోవాలన్నా, మనలో శక్తిని పెంచుకోవాలన్నా అందుకు మెడిటేషన్ చక్కని సాధనము. దీనితోపాటు ఆధ్యాత్మిక జ్ఞానము, అవగాహన, విజ్ఞానము కూడా మన నమ్మకాలను సరి చేసుకోవడంలో ఎంతో ఉపకరిస్తాయి. కావున, ఒత్తిడి సమయాలలో, మీరు ఒక్క క్షణం ఆగి, మీ ఆలోచనలను పరిశీలించుకుని, గతంలోకి వెళ్ళి ఆ సమయంలో మీ ఆలోచనలకు మూలమైన మీ నమ్మకాలు సరిగ్గానే ఉన్నాయా అని చూసుకుని, అవసరమైతే వాటిని మార్చుకోవాలి. ఇందుకు శక్తి మరియు స్పష్టత కావాలి, ఇవి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా లభిస్తాయి. నమ్మకాలను సరి చేసుకున్న తర్వాత, ఆలోచనా తీరు మారుతుంది. నేను సమయానికి చేరుకోకపోతే, నా ప్రాజెక్టును సమయానికి పూర్తి చేయకపోతే నా ప్రమోషన్ పోతుందేమో; లేక నేను డబ్బును పోగొట్టుకుంటే నా కుటుంబం నన్ను చూసి హర్షించదేమో వంటి ఆలోచనలను భద్రత, నిర్భయత, ఓర్పు, శాంతి, నమ్మకం, దృఢత్వం, నిశ్చితత్వం మొదలైన పాజిటివ్ ఆలోచనలతో భర్తీ చేయాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »