Hin

29th october 2024 soul sustenance telugu

October 29, 2024

మనస్సు యొక్క రాజ్యాన్ని పరిపాలించడం (పార్ట్ 2)

నేను బలహీనమైన రాజునా (ఆత్మ) లేదా శక్తివంతమైన రాజునా? ఇది మనలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు చివరిలో మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. ప్రతి రాత్రి, మీ మంత్రులను, మీ రాజ్య ఆస్థానంలోని ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలను సంప్రదించండి. రాజ్యం మరియు దాని ప్రజల గురించి వారితో హృదయపూర్వకంగా సంభాషించండి. ప్రజలు అంటే మీ వైఖరులు, వ్యక్తీకరణలు, మాటలు మరియు చర్యలు. మంత్రుల ప్రవర్తన యొక్క రోజువారీ నివేదికను చెక్ చేయడానికి ఒక న్యాయస్థానం కూడా నిర్వహించబడుతుంది. ఒక రాజ్యానికి మంత్రులు ఏ విధంగా ఉంటారో,  అదే విధంగా ప్రజలు కూడా ఉంటారు. రాజ్యాన్ని క్రమబద్ధంగా ఉంచడానికి, ప్రతిరోజూ రాజ్యం ఎదుర్కొనే వివిధ ప్రతికూల పరిస్థితులు మరియు దృశ్యాలకు సరిగ్గా స్పందించడానికి ఒక సానుకూల రాజు తన మంత్రులకు మరియు ప్రజలకు శిక్షణ ఇస్తాడు. రాజు యొక్క ఆధ్యాత్మిక శక్తి కర్మలో కనిపించడమే ఈ సామర్ధ్యం. సరిగ్గా స్పందించడానికి రాజ్యంలోని మంత్రులకు మరియు ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి ఒక శక్తివంతమైన రాజు రోజు ప్రారంభంలో మరియు రోజులో క్రమమైన వ్యవధిలో, మనస్సుకు సానుకూల ఆలోచనలను ఇస్తాడు.నేను నా ప్రశాంతతను కాపాడుకుంటాను మరియు ప్రతి పరిస్థితికి శాంతియుతంగా ప్రతిస్పందిస్తాను; నేను స్థిరంగా ఉంటూ ఇతరుల సానుకూల చర్యలను మాత్రమే చూస్తాను;నేను బాహ్య పరిస్థితులకు, అంతర్గత ఒత్తిళ్లకు అతీతమై అంతర్గత నిర్లిప్తతను కలిగి ఉంటాను. అలాగే, నేను మంచి భావాలకు మరియు ఆశీర్వాదాలకు సానుకూల మూలం; నేను ఇతరుల బలాలు మరియు ప్రత్యేకతలపై దృష్టి పెట్టి వారిని గౌరవిస్తాను; నేను ఇతరుల గుణాల నుండి ప్రేరణ పొందుతాను, నా గుణాలను ఇతరులకు ప్రసరింపజేస్తాను అనేవి ప్రేమ ఆలోచనలు.  అలాగే, తేలికగా ఉండి, ఇతరులకు అదే తేలికపాటి అనుభవాన్ని ఇస్తాను; నేను ఉత్సాహం యొక్క రెక్కలను విస్తరించి, నిరంతరం ఆనందంతో ఎగురుతున్నాను; నేను సంభాషించే ప్రతి ఒక్కరికీ చిరునవ్వు మరియు మంచితనాన్ని బహుమతిగా ఇస్తాను అనేవి సంతోషకరమైన ఆలోచనలు. నేను ప్రతి దశలో మరియు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తాను; నేను చేసే ప్రతి పనిలో సంకల్ప శక్తిని ఉపయోగిస్తాను; నా మార్గానికి ఆటంకం కలిగించే అడ్డంకులను నా ఆధ్యాత్మిక శక్తితో నాశనం చేస్తాను అనేవి శక్తి యొక్క ఆలోచనలు. అలాగే, ఈ రకమైన ధృవీకరణలు నా ఆలోచనలను, భావాలను మరియు భావోద్వేగాలను, నా రాజ్య మంత్రులను మరియు నా వైఖరులను, వ్యక్తీకరణలను, మాటలను మరియు చర్యలను, నా రాజ్య ప్రజలను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. మరి అది ఎలా? రేపటి సందేశంలో మేము దానిని వివరిస్తాము.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »