Hin

30th october 2024 soul sustenance telugu

October 30, 2024

మనస్సు యొక్క రాజ్యాన్ని పరిపాలించడం (పార్ట్ 3)

వేలాది సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ భూభాగాలను పాలకులు పరిపాలించారు. ఒకానొక సమయంలో పాలకులు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించేవారు. ఆ సమయంలో వారి రాజ్యంలో దుఃఖం, ద్వేషం, అన్యాయం లేదా అశాంతి జాడ లేకుండా ఉండేది. నేడు ఈ పాలకులు దేవి దేవతలుగా మనకు తెలుసు. మరి వారి విజయ రహస్యం ఏమిటి? వారు పరిపాలించే నైపుణ్యాలతో పాటు, విజయవంతం కావడానికి అన్ని అధికారాలను కలిగి ఉండటమే ఆ రహస్యం. కాబట్టి ఆధ్యాత్మిక రాజునైన ఆత్మనైన నా విజయ రహస్యం ఏమిటి? నేను నా ఆధ్యాత్మిక శక్తులను పెంచుకొని వాటిని నా వ్యక్తిత్వంలో భాగంగా చేసుకోవడం ఎలా? నిన్నటి సందేశంలో మేము వివరించిన ఆలోచన ధృవీకరణలను సృష్టించడం. శాంతి, ప్రేమ, ఆనందం మరియు శక్తి వంటి ధర్మాలను ధృవీకరించే ఆలోచనలు.

ఈ సద్గుణ ఆలోచనలు, ప్రతిరోజూ నా చేతన మనస్సులోకి పదేపదే తీసుకువచ్చినప్పుడు, అవి క్రమంగా నా ఉపచేతన మనస్సును సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది నన్ను ఆధ్యాత్మిక రాజు వ్యక్తిత్వంతో మరియు ఆ సద్గుణాలతో నింపుతుంది. సద్గుణాలు నాలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. ఇది నన్ను బలోపేతం చేస్తుంది. అలాగే, సహించే శక్తి, సర్దుబాటు శక్తి, ఎదుర్కొనే శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, సంకీర్ణ శక్తి, ఇముడ్చుకునే శక్తి మరియు సహయోగ శక్తి వంటి ఎనిమిది ప్రాధమిక ఆధ్యాత్మిక శక్తులు కలిగిన రాజుగా చేస్తుంది. అటువంటి శక్తితో నిండిన రాజు తన మంత్రులైన ఆలోచనలకు, భావాలకు మరియు భావోద్వేగాలకు మరియు అతని ప్రజలలైన వైఖరులకు, వ్యక్తీకరణలకు, మాటలకు మరియు చర్యలకు కట్టుబడి ఉంటాడు. వారందరూ వారి రాజు యొక్క వ్యక్తిత్వంతో అనుసంధానించబడి సద్గుణాలు మరియు ఎనిమిది శక్తులకు అనుగుణంగా బాహ్య పరిస్థితులకు స్పందించడం నేర్చుకుంటారు. రాజు వలె  మంత్రులు,  మంత్రుల వలె ప్రజలు ఉంటారు. దానికి ఫలితంగా మొత్తం రాజ్యంలో శాంతి, ప్రేమ మరియు ఆనందంతో నిండిన వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి క్రమబద్ధమైన రాజ్యం ఆత్మగౌరవం కలిగిన రాజ్యం. అలాగే, ఈ రాజ్యం ప్రతిరోజూ సంపర్కంలో వచ్చే ఇతర వ్యక్తులచే గౌరవించబడుతుంది, ఎందుకంటే అటువంటి రాజ్యంతో కలిసిన ప్రజలు రాజ్యం మరియు రాజు నుండి ఈ గుణాలను మరియు శక్తులను అన్ని సమయాల్లో అనుభవిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »