Hin

28th october 2024 soul sustenance telugu

October 28, 2024

మనస్సు యొక్క రాజ్యాన్ని పరిపాలించడం (పార్ట్ 1)

మీ అంతర్గత రాజ్యంలో మీ మంత్రులు అయిన మీ ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలను మీరు ఎప్పుడైనా చూశారా? ఇది న్యాయ రాజ్యమా లేక అన్యాయ  రాజ్యమా? నా రాజ్యం మరింత క్రమవంతంగా  మరియు తక్కువ గందరగోళం ఉండి ఉంటే బాగుండేది! అని మీరు ఎప్పుడైనా మీ గురించి ఆశ్చర్యపోతున్నారా? అయితే లా అండ్ ఆర్డర్ తో కూడిన రాజ్యాన్ని సృష్టించకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఏమిటి? బాహ్య పరిస్థితులా లేదా ఈ పరిస్థితులపై మీ అంతర్గత ప్రతిచర్యలా? కేవలం ఒక రోజు, ఈ ఒక్క చిన్న సాధన చేయండి, మీరు ఒక రోజులో సృష్టించే వేలాది ఆలోచనలలో మరియు భావాలలో, ఎన్ని మీ స్వంత సృష్టి మరియు ఎన్ని బాహ్య సంఘటనలకు ప్రతిస్పందనలు ఉన్నాయో చెక్ చేయండి. అవి మీ స్వంత సానుకూల సృష్టి అయితే లేదా అవి సంఘటనలకు సరైనవి ప్రతిస్పందనలు అయితే, మీ మంత్రులు మీకు కట్టుబడి ఉన్నారని గర్వంగా చెప్పండి. ఈ ఆలోచనలు మరియు భావాలు, మీ సానుకూల సృష్టి కాకుండా, మీ తప్పుడు ప్రతిచర్యలు అయినప్పుడే ఈ మంత్రులు మీకు కట్టుబడి ఉండకుండా క్రమవంతంగా లేరని  మీరు గ్రహించారా?

మంత్రులు రాజుకు కట్టుబడి లేని రాజ్యం అంటే ఆత్మ అయిన మీరు ఒక రాజ్యం అనుకుంటే , దాని వాతావరణంలో పదే పదే శాంతి, ప్రేమ మరియు ఆనందం లోపిస్తుంది. ఇక్కడ రాజ్యం మన మనస్సు. ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాలు మంత్రులు. అంటే మార్గనిర్దేశం చేసే మంత్రులను ప్రజల ద్వారా గౌరవించబడని రాజ్యం ఇది. ప్రజలు అంటే మీ వైఖరులు, వ్యక్తీకరణలు, మాటలు మరియు చర్యలు. వారు ప్రతికూల ఆలోచనలు, భావాలు మరియు భావోద్వేగాల ప్రభావంతో మరింత తప్పుగా ప్రవర్తిస్తారు. రాజు బాహ్య పరిస్థితులను బలంగా ఎదుర్కోలేని రాజ్యం ఇది. అలాగే, ఇది స్థిరత్వం లేని రాజ్యం. 

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »