Hin

4th jan 2024 soul sustenance telugu

January 4, 2024

మనస్సు కోసం ఆరోగ్యకరమైన ఎమోషనల్ డైట్ (పార్ట్ 1)

మన జీవనశైలిలో 5 సరళమైన విషయాలను పాటించి ఆరోగ్యకరమైన భావోద్వేగ ఆహారాన్ని ఎంచుకుందాం –

  1. ఉదయాన్నే వార్తాపత్రికలు చదవడం, వార్తా ఛానెల్‌లు లేదా టీవీ షోలు చూడటం వంటివి మానుకోండి. దానికి బదులుగా, స్వచ్ఛమైన, శక్తినిచ్చే మెసేజ్ లను చదవడానికి లేదా వినడానికి కనీసం 15 నిమిషాలు వెచ్చిద్దాం. సమయ పరిమితులను అధిగమించడానికి, మనం దీన్ని మన వాకింగ్, వ్యాయామం, వంట చేసేటప్పుడు లేదా పనికి వెళ్లేటప్పుడు కూడా చేయవచ్చు. ఈ విధంగా మనం మన దినచర్యను మనస్సుకు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభిస్తాము.
  2. మీరు ఉదయం చదివిన దాని నుండి ఒక పాజిటివ్ పాయింట్‌ని ఎంచుకుని సంకల్పం చేసుకోండి. మన వ్యక్తిగత, ప్రస్తుత జీవిత పరిస్థితులకు అనుగుణంగా సంకల్పం చేసుకోండి. సంకల్పం మనకు ఇప్పటికే ఉన్నవాటిని లేదా వాస్తవంగా మనకు కావలసిన వాటిని లక్ష్యంగా పెట్టుకోవాలని గుర్తుంచుకోండి. ప్రతి గంట తర్వాత, ఒక నిమిషం ఆగి, సంకల్పాన్ని విజువలైజ్ చేసుకుంటూ రిపీట్ చేసుకోండి.
  3. వాట్సాప్‌లో నెగిటివ్ మెసేజ్‌లను చదవకుండానే డిలీట్ చేద్దాం, ఫేస్‌బుక్ లేదా మరేదైనా సోషల్ మీడియాలో అలాంటి మెసేజ్ లు విస్మరించండి. ఇతరుల గురించిన విమర్శనాత్మక అభిప్రాయాలు, ఒకరిని చెడుగా చూపించే జోక్, ఒకరి పట్ల పక్షపాతం చూపే మెసేజ్‌, మతం, స్థానం , రాజకీయ అభిప్రాయాలు మొదలైనవాటిని చదవవద్దు. మనం మెసేజ్‌ ని చదివితే దానిని గ్రహించినట్టే. ఇది ఆ సమస్య గురించి మాత్రమే కాకుండా మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది, తద్వారా మనకు విమర్శలు, కోపం మరియు బాధ యొక్క ఆలోచనలు వస్తాయి. మనం చదివేది, చూసేది, వినేది మన స్వరూపంగా మారుతుంది.
  4. నిద్రించే ముందు వార్తలు, రోజువారీ టీవీ కార్యక్రమాలు చూడటం లేదా వార్తాపత్రిక చదవడం మానుకోండి. బదులుగా, సానుకూల సమాచారాన్ని గ్రహించడానికి నిద్రపోయే ముందు 10 నిమిషాలు కేటాయించండి. ఇది మన రోజును చక్కగా ముగిస్తుంది మరియు మనస్సును ప్రశాంతపరుస్తుంది, తద్వారా మనం మంచి నిద్రను ఆనందిస్తాము. ఇది రోజులో మన చివరి ఆలోచనలు ఎటువంటి ప్రతికూలత చుట్టూ చెల్లాచెదురు కాకుండా నిర్ధారిస్తుంది.
  5. ఎల్లప్పుడూ ఒక పాజిటివ్ పుస్తకం, మెసేజ్ లేదా ఫోన్‌లో పాజిటివ్ క్లాస్ మనతో తీసుకువెళదాం. మనకు ఇబ్బందిగా అనిపించిన వెంటనే చదవాలి లేదా వినాలి. రోజులో 5 నిమిషాలైనా ఉన్నతమైన మరియు పాజిటివ్ సమాచారం తీసుకోవడం మన మనస్సులోని నెగెటివ్ ఆలోచనల పరంపరను నిలిపివేస్తుంది. ఆ సందేశం మన సమస్యకు పరిష్కారాన్ని అందించవచ్చు. తక్షణ ఆరోగ్యకరమైన ఆహారం ఆత్మను బలపరుస్తుంది మరియు పాజిటివ్ ప్రతిస్పందనను కలిగించే శక్తిని ఇస్తుంది. ఇది మన భావోద్వేగ ప్రథమ చికిత్స కిట్.

(సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th june2024 soul sustenance telugu

  పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 3)

భవిష్యత్తు మాత్రమే అత్యంత ముఖ్యమైనది అనే ఆలోచన నుండి కూడా మనం విముక్తి పొందాలి. సామాజికంగా చెల్లుబాటు అయ్యే లక్ష్యాలను సాధించే ఈ ట్రెడ్‌మిల్‌లో, విజయాన్ని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము,  కనీసం దానిని సాధించినందుకు

Read More »
18th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 2)

సంతోషం మరియు విజయం వాస్తవానికి పరస్పరం ముడిపడి ఉంటాయి. ఆ రెండు ఒక సాధారణ అంశాన్ని పంచుకుంటాయి – వాటిని అనుసరించలేము. మనం ఆత్మిక స్థితిని అభ్యసిస్తే, విజయం మరియు సంతోషం  రెండింటినీ సాధించిన

Read More »
17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »