Hin

5th jan 2024 soul sustenance telugu

January 5, 2024

మనస్సు కోసం ఆరోగ్యకరమైన ఎమోషనల్ డైట్ (పార్ట్ 2)

నిన్నటి సందేశంలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా నుండి నెగెటివ్ భావోద్వేగ డైట్ తీసుకోవడం ఎలా నివారించాలో చూశాము. మన మనసులోని విషపూరిత ఆలోచనల నిర్మూలన కోసం కొన్ని సరళమైన టిప్స్ తో   మీ ముందుకు వచ్చాము.

ప్రతికూల సమాచారం యొక్క మరొక మూలం మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కూడా వస్తుంది – మనం నివసించే ప్రదేశం, ఉమ్మడి కుటుంబం, స్నేహితులు, పరిచయస్తులు లేదా కార్యాలయ సహచరులు. వారు తరచుగా  ఇతరుల సమస్యలు,  సంస్కారాలు లేదా ప్రవర్తనల గురించి అనగా మనం ఏమీ చేయలేని వాటి గురించి మనతో మాట్లాడతారు. మనం ఈ సమాచారాన్ని శ్రద్ధగా వింటాము. అటువంటి సమాచారాన్ని వినడం అంటే హానికరమైన భావోద్వేగ ఆహారాన్ని తీసుకోవడం. మనం ఏది విన్నా, మనం వింటున్న వ్యక్తి గురించి మాత్రమే కాకుండా అది మన ఆలోచనా ప్రక్రియలో భాగమవుతుంది.

ఒక వ్యక్తి గురించి ఎవరైనా అభిప్రాయం చెప్పినప్పుడు, అది నిజం కానవసరం లేదు. అలాంటి వ్యక్తులు వారి సంస్కారాల ఆధారంగా వారి దృక్పథాన్ని మాత్రమే పంచుకుంటున్నారు. సంబంధాలలో లేదా కార్యాలయంలో ఎవరైనా విమర్శించే సంస్కారం ఉన్నవారు, అసూయపడే సంస్కారం ఉన్నవారు, ఆందోళన యొక్క సంస్కారం ఉన్నవారు ఇతరుల గురించి ఎలా మాట్లాడతారు అని మనం చూస్తూనే ఉంటాము.

మనకు తప్పుడు భావోద్వేగాలు కలిగించే మొదటి అంశం – మనం మాట్లాడుకుంటున్న వ్యక్తి యొక్క బలహీనతల గురించి మాట్లాడుకోవడం. రెండవ అంశం మనతో మాట్లాడే వ్యక్తి యొక్క బలహీనత. మనం దానిని విని మన బలహీనత యొక్క మూడవ అంశాన్ని జోడిస్తాము. కనుక మూడు విధాలుగా భావోద్వేగ ఆహారం తీసుకుని నెగెటివ్ బరువు మోస్తూ ఉంటాము. మనం తేలికగా మరియు సంతోషంగా ఉండాలంటే, అలాంటి హానికరమైన ఆహారం నుండి మనల్ని మనం రక్షించుకోవాలి.

 (సశేషం)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »