Hin

7th jan 2024 soul sustenance telugu

January 7, 2024

మనస్సు కోసం ఆరోగ్యకరమైన ఎమోషనల్ డైట్ (పార్ట్ 4)

మన మొదటి బాధ్యత మన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. కాబట్టి మనం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లే, మనస్సును కూడా శ్రద్ధగా చూసుకుందాం. గత మూడు రోజుల మెసేజ్‌లలో, మనం చదివే, చూసే మరియు వినే వాటి ఆధారంగానే మన స్వభావం ఉంటుంది అని తెలుసుకున్నాము. మనము ఏమీ చేయలేని వాటి గురించి మకు ప్రతికూల సమాచారం ఇచ్చే వ్యక్తుల నుండి సమాచారాన్ని  ఎలా నివారించాలో కూడా మనం విశ్లేషించాము.

ఒక వ్యక్తి మన గురించి ఇతరులతో చెప్పేది పంచుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని పరిష్కరించడానికి మనం ఏం చేయవచ్చో ఇప్పుడు చూద్దాం –

1: మన గురించిన అభిప్రాయాన్ని విందాము. దాని గురించి మనం ఏదైనా చేయగలిగితే, మనం చేయవలసినది చేయాలి. దాని గురించి ఏమీ చేయలేము అనుకుంటే దాని గురించి ఆలోచించకుండా మనసులో బరువు పెంచుకోకుండా దానిని పూర్తిగా విస్మరించాలి, పూర్తిగా వదిలేయాలి.

2: చాలా సార్లు జరిగినట్లుగా, చాలా మంది వ్యక్తులు కేవలం వారి సంస్కారం ఆధారంగా అతిశయోక్తిగా మార్చవచ్చు మరియు వారి సంస్కారం ప్రభావితమైన అభిప్రాయం కావచ్చు. కాబట్టి మకు చేరినది సత్యానికి చాలా భిన్నంగా ఉండొచ్చు. కనుక దానిని వదిలేయాలి. అవసరమైతే లేదా పరిష్కరించాల్సిన సమస్యలు ఉంటే  ఎవరి గురించి విన్నారో వారితో నేరుగా మాట్లాడవచ్చు.  

3: మనము సమాచారాన్ని వినడానికి వినయంగా తిరస్కరించవచ్చు. దీన్ని మతో పంచుకునే వారికి – ఇతరులు నా గురించి ఏమి చెబుతున్నారో, నేను దాని గురించి ఏదైనా చేయవలసి ఉందని మీకు అనిపిస్తే మాత్రమే నాకు చెప్పండి అని వారికి స్పష్టంగా తెలియజేయండి.

పైవాటిలో దేనినైనా ఎంచుకోవడం ద్వారా, మము మన సంకల్ప శక్తిని పెంచుకుంటాము. ఆరోగ్యకరమైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభిస్తాము. ఇలాంటి పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. వాటిని చక్కగా ఎదుర్కోవడం ద్వారా, మన చెడు సంస్కారాలు మరియు ప్రతికూలతలు ముగుస్తాయి. మనం రెండు మూడు సార్లు ప్రతికూల సమాచారాన్ని తిరస్కరిస్తే, మన చుట్టూ ఉన్న వ్యక్తులు అలాంటి విషయాలను మన దృష్టికి తీసుకురావడం మానేస్తారని గుర్తుంచుకోండి.

అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఆత్మ శక్తివంతమవుతుంది. ఆత్మ శక్తివంతమైతే మన బలహీనతలన్నీ తొలగిపోతాయి. కోపం, భయం మొదలైన ప్రతీ బలహీనతను ఒక్కొకటిగా మనం మార్చలేము అని కు తెలుసు. కానీ ఆత్మ శక్తివంతంగా మారినప్పుడు, బలహీనతలన్నీ దూరమవుతాయి. ఇది మన శారీరక ఆరోగ్యంతో పోల్చదగినది – మన రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే, జలుబు లేదా జ్వరం వంటి అనారోగ్యాలతో పోరాడాల్సిన అవసరం ఉండదు, మన రోగనిరోధక వ్యవస్థ వాటన్నింటినీ నివారిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »
7th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సరిదిద్దుకోవటం – ఆత్మలో జ్ఞాపకాలు ఆత్మపై ముద్రలు వంటివి. కొన్ని ముద్రలు లోతైనవి, కొన్ని కాకపోవచ్చు. గత నెగిటివ్ అనుభవాలు ఆత్మపై

Read More »
6th july 2025 soul sustenance telugu

గతాన్ని వదిలేసేందుకు 7 పద్ధతులు (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు పాజిటివ్ సమాచారం మరియు ఆధ్యాత్మిక నషా – మనం ప్రతిరోజూ 10 నిమిషాల పాటు పాజిటివ్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా

Read More »