Hin

6th feb 2024 soul sustenance telugu

February 6, 2024

మనస్సు మరియు దాని రచనలు  

శాస్త్రవేత్తలు మానవుడి శరీరం యొక్క పనితీరు గురించి చాలా నేర్చుకున్నారు, అయితే వారిని మానవుడిని సజీవంగా ఉంచేది ఏంటి అని అడిగితే, చాలా మంది అది పూర్తిగా పరిష్కరించబడని రహస్యమని అంగీకరిస్తున్నారు. మనలో చాలా మంది విశ్వసించినట్లుగా, మెదడులోని రసాయన మరియు విద్యుత్ కార్యకలాపాల యొక్క ఉత్పాదకత కంటే ఆధ్యాత్మికత నాకు మార్గాన్ని చూపించి  నా సత్య స్వరూపానికి, నా ఆధ్యాత్మిక స్వభావానికి దగ్గరగా రావడానికి నాకు శిక్షణ ఇస్తుంది. మునుపు, నా స్పృహ లోపల ఏమి జరుగుతుందో తెలియక, నా సత్య స్వభావానికి దూరంగా ఉంటూ నాకు నేను అపరిచితుడిలా ఉన్నాను. స్వయానికి దగ్గర అవడానికి మొదటి అడుగు, నా మనస్సు యొక్క శక్తిని సాధ్యమైనంత ప్రభావవంతంగా ఉపయోగించడం నేర్చుకోవడం. దీని కోసం, నా ఆలోచనలు, భావాలు, వైఖరులు, భావోద్వేగాలు అనే మనస్సు యొక్క అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడానికి,  స్వయం పై దృష్టి పెట్టడానికి, ప్రతి రోజు, నేను కొన్ని నిమిషాలు ఏకాంతంగా కూర్చునే స్థలాన్ని చూసుకోవాలని అనుకుంటాను. 

మనస్సు అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? అనే దాని గురించి ప్రపంచంలో చాలా వివాదాస్పద అభిప్రాయాలు ఉన్నాయి. మెడిటేషన్ గురించి బ్రహ్మా  కుమారీల బోధనలలో, నా ఆలోచనలు, భావాలు, వైఖరులు మరియు భావోద్వేగాలకు దారితీసేది శరీరం కాదు, మనస్సు అని, అది  ఆత్మ యొక్క ఆంతరిక శక్తి అని తెలుస్తుంది. ఇది టెలివిజన్ సెట్‌కి మరియు ఆ సెట్‌లో చూసిన సినిమాల మధ్య వ్యత్యాసం లాంటిది. సినిమాలు బుల్లితెర సెట్‌లో కాకుండా దర్శకుల మదిలో పుడతాయి. టెలివిజన్ సెట్ కేవలం సినిమాలను ప్రదర్శించడానికి ఒక మాధ్యమం. అంటే ఇందులో  ఈ 4 రచనలు (ఆలోచనలు, భావాలు, వైఖరులు మరియు భావోద్వేగాలు) ఉంటాయి. ఇవి భౌతికేతర స్పృహలో (లేదా ఆత్మ) ఉద్భవిస్తాయి అంతేకానీ భౌతిక మెదడులో కాదు. మెదడు కేవలం వాటి ప్రాసెసర్ మరియు శరీరం ఒక మాధ్యమం. ఆ ఆలోచనలు, భావాలు, వైఖరులు మరియు భావోద్వేగాలే హావభావాలు, పదాలు మరియు చర్యలలోకి తీసుకురాబడతాయి. నేను దీనిని గ్రహించినప్పుడు మరియు ఈ వ్యత్యాసాన్ని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు, అది చాలా సాధికారతను కలిగిస్తుంది. అప్పుడే నేను సృష్టించిన ఆలోచనలు, భావాలు, వైఖరులు మరియు భావోద్వేగాలు నాకు, ఇతరులకు ఉపయోగకరంగా మరియు శక్తివంతంగా ఉన్నాయా లేదా నన్ను, ఇతరులను దిగజార్చుతున్నాయా అని ఎంచుకోవడానికి వివేకాన్ని ఉపయోగించగలుగుతాను. 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th jan 2025 soul sustenance telugu

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా

Read More »
23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »