Hin

6th jan 2024 soul sustenance telugu

January 6, 2024

మనస్సు కోసం ఆరోగ్యకరమైన ఎమోషనల్ డైట్ (పార్ట్ 3)

నిన్నటి సందేశంలో, మనం ఏమీ చేయలేని విషయాల గురించి మనతో మాట్లాడే వ్యక్తుల మాటలు వినడం వల్ల కలిగే ప్రభావాన్ని చూసి వినడం మానేద్దామని నిర్ణయించుకున్నాము. ఇలా చేయడానికి, మనలో చాలా మంది అవతలి వ్యక్తికి మన సమయాన్ని వృథా చేసుకోవద్దు అని చెబుతాము కానీ నిజానికి మన శక్తిని కాపాడుకుందాం అని చెప్పాలి. మనకు  సమయం ఉండవచ్చు కానీ మనం ఇప్పటికే మానసికంగా బలహీనంగా ఉన్నాము. వ్యర్థ సంభాషణల్లో మునిగితేలడం మనల్ని మరింత క్షీణింపజేస్తుంది.

ప్రతికూల ఎమోషనల్ డైట్ నుండి దూరంగా ఉండటానికి క్రింద విషయాలు  సహాయపడతాయి. మనతో మాట్లాడే వ్యక్తికి మరియు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది.  

1: మనం ఎవరి సమస్యలు, సంస్కారాలు లేదా ప్రవర్తన గురించి వినకూడదని మర్యాదగా, దృఢంగా తిరస్కరించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. మన శారీరక ఆహారం పై  శ్రద్ధ చూపించినట్లే మన మానసిక పరిస్థితి పై కూడా శ్రద్ధ చూపించాలి – ఎలాగైతే కొన్ని ప్రతికూలమైన ఆహారాలను ఎంత ఆకర్షణీయంగా ఉన్నా,  ఎంత ప్రేమగా అందించినా తినడానికి నిరాకరిస్తామో, అలాగే ఎమోషనల్ డైట్ తిరస్కరించడం ద్వారా మనం ఈ క్రమశిక్షణను పెంపొందించుకుందాం.  

2: సంభాషణను సమస్య-ఆధారితం నుండి పరిష్కార-ఆధారితంగా మార్చండి. మనతో మాట్లాడే వ్యక్తి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై దృష్టిని మళ్లించండి, తద్వారా అవతలి వ్యక్తితో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. అప్పుడు మనం మనతో లేని వ్యక్తి యొక్క సంస్కారం గురించి కాక మనతో మాట్లాడే వ్యక్తి యొక్క సంస్కారం గురించి చర్చిస్తాం.

3: మనతో మాట్లాడే వ్యక్తి యొక్క దృక్కోణాన్ని మార్చండి. వారు మాట్లాడుతున్న వ్యక్తిగురించి అన్ని సానుకూలాంశాలను చూసేందుకు మనం వారికి సహాయపడగలము. ఒకరిపై ఫిర్యాదు చేసినప్పుడు, వారు ఫిర్యాదు చేసిన వ్యక్తి యొక్క మంచి లక్షణాలను గుర్తించడంలో అందరూ విఫలమవుతూ ఉంటారు. 

4: మనం కేవలం ప్రతిదానికీ నిశ్శబ్దంగా తల ఊపే శ్రోతలుగా ఉండకూడదు. ఇది ఇతరుల భావాలకు మన  ఆమోదాన్ని తెలుపుతుంది. చాలా సార్లు మర్యాద కోసం, తప్పదని లేదా వినడానికి నిరాకరించడం మన సంబంధాన్ని దెబ్బతీస్తుందనే భయంతో మనం ఇతరులు చెప్పేవి వింటూ ఉంటాము. శరీరానికి హాని కలిగించని వాటిని తినడానికి నిరాకరించినప్పుడు మనం చెడుగా భావించనట్లే, మన మనస్సుకు అనారోగ్యకరమైన వాటిని తిరస్కరించాలి. ఇది మనకు మరియు వారికి మంచిది.

(సశేషం )

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

25th june2024 soul sustenance telugu

విజయం కోసం పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తయారుచేసుకోవడం (పార్ట్ 1)

జీవితంలో వివిధ రకాల పరిస్థితులు ఎదురుకోవడం, వివిధ రకాల వ్యక్తులను కలవడం, మీకు ఎన్నో సవాళ్లను తీసుకొస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అలాగే, మన వ్యక్తిత్వం  స్థాయిలో మన శక్తులు

Read More »
24th june2024 soul sustenance telugu

పోటీ పడకుండా సహకరించుకుందాం

నిజమైన సహకారం అంటే సర్వులకు ఎల్లవేళలా తన వారనే భావన మరియు సాధికారత ఉద్దేశ్యంతో షరతులు లేని సహాయాన్ని అందించడం. ఇది వినయం, ప్రేమ, కరుణ మరియు తాదాత్మ్యం వంటి మన నిజ గుణాలను

Read More »
23rd june2024 soul sustenance telugu

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

Read More »