Hin

10th dec 2024 soul sustenance telugu

December 10, 2024

మనతో మంచిగా లేని వ్యక్తులకు కృతజ్ఞత

కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలు మనకు దాదాపు భరించలేనివిగా అనిపిస్తాయి. వారు మన జీవితంలోకి వచ్చి వారి మాటలు, ప్రవర్తనలతో గందరగోళాన్ని సృష్టించారని మనం భావిస్తాము. అలాంటి వ్యక్తులు మన సామర్థ్యాన్ని బయటకు తీసుకువస్తారని, మనం ఎదగడానికి మరియు బలంగా ఉండటానికి సహాయపడతారని మనం గ్రహించము. మనతో మంచిగా ఉండని వారికి కృతజ్ఞతతో ఉందాం. మంచి వ్యక్తులు మీకు మంచి సమయాన్ని ఇస్తారని, కానీ తప్పుడు వ్యక్తులు మీకు మంచి పాఠాలు చెబుతారని మీరు నమ్ముతున్నారా? మీతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు ఆ అనుభవాలను అనుభవించిన తరువాత మీరు ఎంత శక్తివంతంగా అయ్యారో మీకు తెలుసా? వారు మొరటుగా ఉన్నా, మనకు ద్రోహం చేసినా, మన విజయానికి అడ్డంకిని సృష్టించినా, మనతో అబద్ధాలు చెప్పినా లేదా మనకు హాని చేసినా, వారు మన విధిని మార్చడానికి నిమిత్తులు. సమస్యను స్వతంత్రంగా ఎదుర్కోవటానికి, ఏ పరిస్థితిని అయినా అధిగమించి శక్తివంతంగా ఉండటానికి వారు మనల్ని బలంగా చేస్తారు. వ్యక్తులు మనతో సరిగ్గా లేనప్పుడు, మనం అంగీకరిస్తూ సర్దుబాటు చేసుకుంటాము, వారి ప్రవర్తనపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త ఆలోచనా విధానాలకు అనుగుణంగా ఉంటాము. మనం మన అహంభావాన్ని తగ్గించుకుంటాము, మన మంచితనాన్ని పెంచుకుంటాము మరియు మన కర్మలను శుద్ధంగా ఉంచుకుంటాము. శక్తివంతంగా అవ్వడంతో, మన భావోద్వేగాలు ఇతరులపై ఆధారపడి ఉన్నాయనే మన గత నమ్మకాన్ని మార్చుకుంటాం కూడా. అటువంటి వ్యక్తులకు కృతజ్ఞతతో, దయతో, శాంతియుతంగా ఉండటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ మీకు మీరే గుర్తు చేసుకోండి – నేను తెలివైనవాడిని. నా జీవితంలో ప్రతి ఒక్కరూ నాతో ఎలా ప్రవర్తించినా నేను వారికి కృతజ్ఞుడను. నేను వారిని బాగా చూసుకుంటాను. ఈ రోజు నేను ఇలా శక్తివంతమైన, వినయపూర్వకమైన వ్యక్తిగా ఉండటానికి నాకు బలం ఇచ్చినందుకు, నాతో మంచిగా లేని వ్యక్తులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

మీరు ఒక శక్తివంతమైన వ్యక్తి అని మీకు మీరే క్రమం తప్పకుండా గుర్తు చేసుకోండి. మీ జీవిత ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, వారి పాత్రకు ధన్యవాదాలు. కొన్నిసార్లు వ్యక్తులు మీతో సరిగ్గా ఉండకపోవచ్చు, వారు అబద్ధాలు చెబుతారు, ద్రోహం చేస్తారు, మిమ్మల్ని పట్టించుకోరు లేదా దుర్వినియోగం చేస్తారు. ఇది వారి పని, వారి ఎంపిక. మీరు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ విలువను గుర్తించి, ఆత్మగౌరవంతో ఉండండి. మీలో ఉన్న ఉత్తమమైనదాన్ని బయటకు తెచ్చినందుకు మీరు వారికి కృతజ్ఞతతో ఉండాలి. వారి ప్రవర్తన మీ సహనాన్ని, మీ ప్రశాంతతను, మీ గౌరవాన్ని, మీ స్థిరత్వాన్ని పెంచే అవకాశాన్ని ఇస్తుంది. మీపట్ల మరియు వారిపట్ల ప్రేమను పెంచుకోండి. వారు తప్పు చేయనందున వారిని క్షమించండి, వారు స్వయంగా బాధలో ఉన్నారు. దాని కారణంగా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మన గత కర్మల ఖాతా ప్రకారం వారు తమ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు వారు మీ గత కర్మను వారితో తీర్చుకోవటానికి మిమ్మల్ని అనుమతిస్తున్నారు. మీరు క్షణికావేశంలో అసౌకర్యంగా భావించినప్పటికీ, మీరు నేర్చుకోవలసిన పాఠాలు, జ్ఞానాన్ని మీకు అందించడానికి వారు వచ్చారని గ్రహించండి. మీ కృతజ్ఞత వారిని ప్రభావితం చేస్తుంది, వారిని నయం చేస్తుంది. మీరు దాని నుండి బలంగా బయటకు వస్తారు. మీరు భావోద్వేగాలను విడిచిపెట్టి, ముందుకు సాగండి, మీరు మెరుగ్గా ఉంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »