Hin

14th mar 2024 soul sustenance telugu

March 14, 2024

మంచి ఆరోగ్యానికి 5 మంచి ఆలోచనలు

  1. నేను గుణాలు, శక్తులతో నిండిన ఆత్మను… నా శరీరంలోని ప్రతి కణాన్ని నేను శక్తులతో, గుణాలతో నింపుతున్నాను… పాజిటివ్ శక్తిని నింపుతూ నేను నా మనసును మరియు శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకుంటున్నాను… నాలోని సంపూర్ణ సానుకూలత నా శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని జీవితాంతం దృఢంగా చేస్తుంది…
  2. నేను శక్తిశాలి పవిత్ర సత్తాను, భ్రూ మధ్య స్థానంలో ఉన్నాను… నాలోని పవిత్రత మరియు శక్తిని తెల్లని కిరణాల రూపంలో నా భౌతిక శరీరానికి అందిస్తున్నాను… నా సంపూర్ణ దేహం శుద్ధమవుతుంది… శరీర వ్యవస్థలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి…
  3. సానుకూల ఆలోచనలు, భావాలు మరియు వైఖరులు ఉన్న ఆత్మను నేను, ఇవి నా సౌరభాన్ని అందంగా, ప్రకాశవంతంగా చేస్తున్నాయి… నా సౌరభం (aura) నా శరీరాన్ని సుందరమైన తరంగాలతో ప్రభావితం చేస్తుంది… ఈ తరంగాలు నా శరీరాన్ని ఎల్లప్పటికీ సంరక్షిస్తుంటాయి…
  4. నేను తినే ప్రతిదానికి, నేను వేసుకునే మందులకు అన్నిటికీ నేను శాంతి, స్థిరత్వం అనే తరంగాలను అందిస్తున్నాను… అవి ఈ తరంగాలను గ్రహించి నా మనసుకు మరియు శరీరానికి మేలు చేసి వాటిని ఆరోగ్యంగా, సంతోషంగా, దృఢంగా చేస్తాయి… చక్కని ఆరోగ్యాన్ని సరైన సమయం, సరైన విధంలో నేను ఎప్పుడూ నావైపుకు ఆకర్షిస్తూ ఉంటాను…
  5. నేను ఆనంద స్వరూపాన్ని, ఆనంద సాగరుడైన పరమాత్మ సంతానాన్ని… నా మానసిక మరియు భావాల తేలికదనం నా శరీర అవయవాలపై పడి వాటిని ప్రశాంతంగా, ఆరామముగా చేస్తున్నాయి… నన్ను కలిసినవారు, నన్ను చూసినవారు తమ జీవితాలలో కూడా తేలికదనాన్ని, ఆరోగ్యాన్ని తీసుకురావాలన్న ప్రేరణను పొందుతున్నారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »
15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »