Hin

7th april 2024 soul sustenance telugu

April 7, 2024

మంచి ఉద్దేశాలు మంచి కర్మను సృష్టిస్తాయి

కర్మ అనేది ఆలోచనలు, మాటలు మరియు చర్యల శక్తి. స్వయాన్ని మనం అంచనా వేసుకున్నప్పుడు దానిని మాటలు మరియు చర్యల స్థాయిలో చేస్తాము. మనం పరిపూర్ణమైన పదాలను పరిపూర్ణ పద్ధతిలో మాట్లాడాము మరియు పరిపూర్ణంగా ప్రవర్తించాము, కానీ మనం పరిపూర్ణ ఆలోచనలను సృష్టించామో లేదో చెక్ చేసుకోము. మనలో చాలా మంది ప్రతికూలంగా ఆలోచిస్తూ, భావిస్తూ కూడా పైకి చాలా మధురంగా మాట్లాడటంలో ప్రావీణ్యం పొందాము. మనం ఏమనుకుంటున్నామో ఎవరూ చూడలేరని మనం ఎప్పుడూ అనుకుంటాం. ఉదా. వారిని కలవడం చాలా అద్భుతంగా ఉందని మనం ఎవరికైనా చెప్పగలం, నిజానికి ఆ సాయంత్రం చాలా బోరుగా అనిపించినా కూడా.  మనం అతిథులను డిన్నర్‌ కి ఉండమని పట్టుబట్టవచ్చు కానీ వాస్తవానికి వారు బయలుదేరటానికి వేచి ఉంటాం. మనం మంచిగా మాట్లాడాము, ప్రవర్తించామని మంచి కర్మ అనుకున్నాం. మనం నిమిషానికి 25 నుండి 30 ఆలోచనలను సృష్టిస్తాము, నిమిషానికి 4 నుండి 5 వాఖ్యాలు మాట్లాడతాము. మనం శక్తి ప్రవాహాన్ని చూసినప్పుడు, 25 ప్రతికూల బాణాలను ఆలోచన శక్తిగా మరియు 5 సానుకూల బాణాలను మాటల శక్తిగా పంపాము. కర్మ అనేది మాటలు మరియు చేతల వెనుక ఉన్న ఆలోచన లేదా ఉద్దేశం. అందరూ చాలా మధురమైన మాటలు మాట్లాడవచ్చు అయినప్పటికీ వారి ప్రతికూల శక్తితో మనల్ని బాధించగలరు. కొందరి మాటలు చాలా పరిపూర్ణంగా ఉండకపోవచ్చు, కానీ వారి శక్తి ప్రేమ, దయాభావంతో నిండి ఉంటుంది. ఇతర ఆత్మలతో మన సంబంధాలు, కర్మల  ఖాతాలు మనం ఎలా ఆలోచిస్తామో,భావిస్తామో అనే పునాదిపై ఆధారపడి ఉంటాయి.

మన మనసులో ఉన్నది మాట్లాడగలుగుతున్నామో లేదో చూసుకుందాం. ప్రతికూల ఆలోచనలను పరిపూర్ణ మాటల్లోకి మార్చే బదులు, మొదట ప్రతికూల ఆలోచనలను పరిపూర్ణ ఆలోచనలుగా మార్చుకుందాం, తరువాత మన ఆలోచనలను తెలియచేద్దాం. అప్పుడు మన ఆలోచనలు, మాటలు మరియు చేతలు అదే సందేశాన్ని అందిస్తాయి. ఆలోచనలు, మాటలు మరియు చేతలు పొందికగా ఉంటాయి. ఏదైనా ఒక పని కావచ్చు – బహుమతి ఇవ్వబడుతుంది, అందించబడిన సహాయం, దాతృత్వం చేయడం, ఇతరులను మెచ్చుకోవడం, ఆ చర్య వెనుక ఉద్దేశాన్ని మనం చెక్ చేసుకుందాం. ఇతరులను సంతోషపెట్టడం లేదా కీర్తి మరియు ప్రశంసలు పొందడం ఉద్దేశ్యమైతే, అది స్వచ్ఛమైన చర్య వెనుక అపవిత్ర ఉద్దేశం.

కాబట్టి మన ఆలోచనలు, భావాలను శుభ్రం చేసుకుందాం, తద్వారా మన పదాల కంటే ముందు మన పరిపూర్ణ శక్తి ఇతరులకు చేరుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th dec 2024 soul sustenance telugu

నిర్భయంగా ఉండటానికి 5 మార్గాలు

స్వీయ గౌరవం యొక్క శక్తివంతమైన స్మృతిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించగల మొదటి, అతి ముఖ్యమైన మార్గం మన స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. ఇంకా, జ్ఞానం, సుగుణాలు, నైపుణ్యాలు మరియు

Read More »
7th dec 2024 soul sustenance telugu

పాత్ర-ప్రేరేపిత ఒత్తిడిని నివారించండి – ఇది ఒక పాత్ర మాత్రమే

చాలా పాత్రలు పోషించవలసి ఉన్నందున, మనం ఒత్తిడిని సహజంగా అంగీకరించాము. పాత్ర అభిమానం మన పదవి, విజయాలు మరియు వయస్సు ఆధారంగా ప్రదర్శించేలా చేస్తుంది. మనం కొన్నిసార్లు మన పాత్రలు, సంబంధాలు మరియు పదవుల

Read More »
6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »