Hin

27th dec 2024 soul sustenance telugu

December 27, 2024

మంచి వృత్తి-జీవిత సమతుల్యతను సృష్టించడం

మన పని మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమనే సత్యాన్ని మనం ఖండించలేము. కానీ కొన్నిసార్లు మనం అదే పనిని అన్నింటిపై ఆధిపత్యం చలాయించేలా అనుమతిస్తాము. మనం జీవితంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించాలి. పనిని మరియు జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సమయం లేదని మనము ఫిర్యాదు చేసినప్పుడల్లా, స్వయం, కుటుంబం లేదా పని, ఈ  మూడింటిలో ఒకదానిపై దృష్టి పెట్టకుండా సమయాన్ని సాకుగా ఉపయోగిస్తాము.

  1. మీ ప్రాధాన్యతలను పరిశీలించుకోండి – అది పని, కుటుంబం, ఆపై సమయం ఉంటే స్వయం గురించి అయ్యి ఉంటూ ఉండవచ్చు. ఆత్మ విత్తనం, కుటుంబం కాండము, మీ పని మరియు మీరు చేసే ప్రతిదీ కూడా చెట్టు. మీ ప్రాధాన్యత యొక్క క్రమం చెట్టు, కాండము, విత్తనం గురించి కాకూడదు. విత్తనం, కాండము, ఆ తరువాత మిగిలిన చెట్టు – ఈ విధంగా ఉండాలి. కాబట్టి మీ ప్రాధాన్యతల క్రమాన్ని స్వయం, కుటుంబం, పని – ఇలా మార్చుకోండి.
  2. మీ సమయాన్ని సరిగ్గా విభజించండి. ధ్యానం, వ్యాయామం చేయడానికి ప్రతి ఉదయం మీ కోసం ఒక గంట సమయాన్ని కేటాయించుకోండి. అలాగే, నిద్ర కోసం 6-7 గంటలు కేటాయించండి. నిర్ణీత భోజన సమయాలను అనుసరించి మనస్సు పెట్టి తినండి. రోజులో 3 నుండి 4 గంటలు కుటుంబంతో గడపండి.
  3. మీ మనస్సును పోషించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి, అందమైన సంబంధాలను కలిగి ఉండటానికి సమయాన్ని షెడ్యూల్ చేసిన తర్వాత, మీరు పనిలో 100% కంటే ఎక్కువ పెట్టేందుకు శక్తివంతం అవుతారు. మీ అంతర్ దృష్టి, నిర్ణయం తీసుకోవడం, సహకారం మరియు ఉత్పాదకత పెరుగుతాయి. మీరు తక్కువ సమయంలో ఎక్కువ సాధిస్తారు. మీ జీవితాన్ని సమతుల్యంగా, సామరస్యంగా ఉంచుకోవడం అనేది మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం నుండి ప్రారంభమవుతుంది.

రికార్డు

18th july 2025 soul sustenance telugu

స్వీయ సందేహం మరియు అభద్రతలను అధిగమించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆనందాన్ని క్షీణింపజేసి, మనకు నిరాశ కలిగించే ఒక భావోద్వేగం – అభద్రత. మన గురించి, మన సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం

Read More »
17th july 2025 soul sustenance telugu

ఇదే సరైన సమయం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మీరనుకున్న మార్పును తీసుకురావడానికి లేదా అసంపూర్ణంగా ఉన్న పనిని పూర్తి చేయడానికి ఏది సరైన సమయం? నేను నూతన సంవత్సరంలో ప్రారంభిస్తాను…

Read More »
16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »