Hin

23rd mar 2024 soul sustenance telugu

March 23, 2024

మనుగడ మనస్తత్వమా లేక సేవ చేసే మనస్తత్వమా

బలవంతులదే మనుగడ అనే తత్వశాస్త్రం ప్రకారం మనం జీవిస్తున్నాము, ఇది జీవితాన్ని పోరాటంగా మారుస్తుంది. సేవ చేసేవాడే సమర్ధుడు అని ఆధ్యాత్మికత మనకు బోధిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అని మనకు ప్రపంచంలో బోధించబడింది. బలవంతులదే మనుగడ అని కూడా మనకు నేర్పిస్తారు. ఈ నమ్మకం మనల్ని సేవ చేయడం కంటే అందరితో పోటీపడేలా చేసింది.

 

  1. మన నిజస్వభావం ఉదారంగా ఉండటమే. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత బలవంతులం అవుతాం. అత్యంత సమర్థులు మాత్రమే మనుగడ సాగిస్తారని మనం నమ్మితే, మనం తీసుకొనే స్థితిలోకి వెళ్తాము మరియు పోటీ భావం, ఇతరులను అధిగమించాలనే కోరికను పెంచుకుంటాము.

 

  1. మన మనుగడకు సంబంధించిన మనస్తత్వం మన సేవా స్వభావానికి అడ్డంకి. మనం ఎంత ఎక్కువ జమ చేసుకుంటే అంత విజయవంతం అవుతాం, అంత సంతృప్తి చెందుతాం అని అనుకున్నాం. ఈ రోజు మనం శారీరకంగా చాలా జమ చేసుకున్నాము, కానీ మనం లోపల ఖాళీగా ఉన్నాము. ఎందుకంటే మన సేవ చేసే స్వభావానికి విరుద్ధంగా చేయడం వల్ల ఏర్పడిన శూన్యత కారణంగా.

 

  1. పంచుకోవడం, శ్రద్ధ మరియు సహకారం వంటి గుణాలను పెంపొందించుకోవడానికి ప్రతిరోజూ మెడిటేషన్ చేసి మిమ్మల్ని మీరు నింపుకోండి. మీరు భౌతికంగా మాత్రమే కాకుండా మీ శాంతి, ప్రేమ మరియు ఆనందం యొక్క వైబ్రేషన్స్ తో మానసికంగా కూడా సేవ చేయడానికి మార్గాలను చూస్తారు.

 

  1. సేవ చేయడం అంటే మీరు మీ ఆకాంక్షలను అణచివేసి, మీ వద్ద ఉన్నదాన్ని ఇవ్వడం కాదు. లక్ష్యాలను నిర్దేశించుకోండి, డబ్బు సంపాదించుకోండి, సుఖాలను ఆస్వాదించండి మరియు మీరు చేయగలిగినదంతా సాధించండి – పోటీ లేకుండా. ఈ ప్రయాణంలో అందరికీ సహకరిస్తూ, వారిని శక్తివంతం చేయండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th jan 2025 soul sustenance telugu

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే

Read More »
18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »