Hin

21st june2024 soul sustenance telugu

June 21, 2024

మనుష్యుల వైబ్రేషన్లను అనుభూతి చెందడం ప్రారంభించండి

మీరు ఎవరినైనా కలిసినప్పుడు, మీ దృష్టి ఎటు వెళుతుంది? ఒకటి: వారి రూపం మరియు వస్త్రాలు పై మీ దృష్టి వెళుతుంది. రెండు: వారి మాటలు మరియు చేతల పై దృష్టి వెళుతుంది. ఇపుడు మూడవది  ఎంపిక చేసుకోండి: వారి వైబ్రేషన్లను అనుభూతి చెందడం పై దృష్టి పెట్టండి. మనం ఒకరి వైబ్రేషన్లను అనుభూతి చెందితే వారిని సరిగా అర్థం చేసుకుంటాము. ఒక నిర్దిష్ట వ్యక్తితో పని చేస్తున్నప్పుడు మీకు చాలా భారంగా అనిపించి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు కేవలం ఒక గంట గడిపిన  వ్యక్తి నుండి మంచి వైబ్రేషన్లను పొంది వారిని తరచుగా కలవాలనుకుంటున్నారా? మనం సాధారణంగా వ్యక్తుల రూపం, వారి దుస్తులు, పదవి, పదజాలం మరియు బాడీ లాంగ్వేజ్ వంటి బాహ్య అంశాల ఆధారంగా అంచనా వేస్తాము. కానీ వారి వైబ్రేషన్లు వారి వాస్తవికతను వెల్లడిస్తుందనే పాయింట్‌ను మరచిపోతాము. ప్రతి వ్యక్తి వారి వైబ్రేషన్లను కలిగి ఉంటారు. కొంచెం శ్రద్ధ చూపడం ద్వారా మనం వాటిని అనుభూతి చెందగలము. మన మనస్సును నిశ్శబ్దం చేసి, కనిపించే పరిమిత అంశాల నుండి కనిపించని శక్తుల వైపు దృష్టిని మరల్చినప్పుడు, మనం వాటి వైబ్రేషన్లను గ్రహిస్తాము. ఇది అవతలి వ్యక్తి యొక్క స్వభావం మరియు ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఎప్పుడైనా మీరు ఎవరినైనా కలిసినప్పుడు, వారి వైబ్రేషన్లను అనుభూతి చెందండి. ఎందుకంటే  మాటలు లేదా ప్రవర్తన మోసపూరితంగా ఉండవచ్చు కానీ వైబ్రేషన్లు అబద్ధం చెప్పలేవు.

 

మీ ప్రామాణికమైన వైబ్రేషన్లను ఇతరులకు ప్రసరింపజేయండి. అదే విధంగా, మీరు ఎవరినైనా కలిసినప్పుడు మీ ఫోకస్‌ని ఉన్నత ఫ్రీక్వెన్సీకి పెంచండి, తక్కువ వైబ్రేషన్ల వద్ద చిక్కుకోకండి, తద్వారా అవతలి వ్యక్తి యొక్క వైబ్రేషన్లు తెలుస్తాయి. మీ మనస్సును నిశ్శబ్దంగా చేసి మీరు కలిసే ప్రతి ఒక్కరి వైబ్రేషన్లు మరియు శక్తిని అనుభూతి చెంది వారి భావనల పై మీ దృష్టిని మార్చండి. వారి శక్తి క్షేత్రాన్ని, ఉద్దేశాలను అనుభూతి చెందండి, వారు ఎలా ఉంటే అలానే గుర్తించి అర్థం చేసుకోండి. మీ అంతర్ద్రుష్టిని విశ్వసించి, మీకు మరియు పరిస్థితికి సరైన ప్రతిస్పందనను ఎంచుకుని మీ పరస్పర చర్యను ముందుకు తీసుకెళ్లండి. మీ వైబ్రేషన్లలో చిక్కుకోవద్దు. మీరు బాహ్య కారణాలకు అతీతంగా వెళుతున్నప్పుడు, మీరు వ్యక్తులలో అబద్ధం లేదా కృత్రిమత్వంలో చిక్కుకోరు. వ్యక్తుల శక్తి క్షేత్రాలను చదవడం మీ అంతర్ దృష్టికి  పదును పెడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »