Hin

11th jan 2025 soul sustenance telugu

January 11, 2025

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు చెప్పేది వినడం చాలా ముఖ్యం. బాగా వినడం ద్వారా, మనం వ్యక్తుల ఉద్దేశాలను గుర్తిస్తాము, సమస్యలను పరిష్కరిస్తాము మరియు బలమైన సంబంధాలను ఏర్పరుస్తాము. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని మరియు ఇతరుల మాటలు తక్కువగా వింటున్నారని మీకు తరచుగా అనిపిస్తుందా? అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు మనసులో మీ ప్రతిస్పందనను తయారు చేసుకుంటున్నారా? మీకు భిన్నమైన అభిప్రాయం ఉంటే కొన్నిసార్లు మీరు ఎవరి మాటలకైనా అంతరాయం కలిగిస్తున్నారా? మనకు రెండు చెవులు మరియు ఒక నోరు ఉన్నాయి, మనం మాట్లాడే దానికంటే ఎక్కువ వినాలి అనే నానుడి ఉంది. కానీ పెరుగుతున్న వయస్సు, హోదా, పాత్ర మరియు బాధ్యతతో మనం వినే కళను కోల్పోతున్నాము. మనం వారి మాటలు వింటూ ఉండవచ్చు, కానీ మన మనస్సు అంతర్గతంగా వారి మాటలను అంచనా వేయడం మొదలుపెట్టి రెస్పాన్స్ ని సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది. మన మనస్సు మాట్లాడుతున్నందున, మనం వినడం లేదు, అంటే మనం ఇప్పటికే తిరస్కరణ వైబ్రేషన్స్ ప్రసరిస్తున్నాము. వినడం అంటే మనం మన మనస్సును నిశ్శబ్దం చేయడం, వారికి భిన్నమైన అభిప్రాయం ఉందని అర్థం చేసుకోవడం, మన దృక్పథం నుండి మనం వేరు అవడం, వారి అభిప్రాయాన్ని గౌరవించి వారి మాటలను అంగీకరించడం. బయట లేదా మన మనస్సులో పరధ్యానం లేదు. మనం వారి అభిప్రాయాలను ఆత్మపరిశీలన చేసుకొని, ఆపై మన అభిప్రాయాన్ని తెలియజేస్తాము. వ్యక్తులు తప్పుగా అనిపించినా, మీ అభిప్రాయాలను పక్కనపెట్టి,   విశాల దృక్పథం‌తో వినండి.

మీరు నివసించే మరియు పని చేసే వ్యక్తులతో మంచి సంబంధాలను కలిగి ఉండటానికి, సంభాషించే కళలో ప్రావీణ్యం పొందండి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ద వహించండి, ఫోన్, టీవీ లేదా కంప్యూటర్ వంటి వాటి వైపు నుండి దృష్టిని మరల్చి వారితో చూపు కలపండి. వారి రూపురేఖలు, ఉచ్ఛారణ లేదా భాష పై దృష్టి పెట్టకుండా ప్రతి పదాన్ని వినండి. వారి వైబ్రేషన్లను ఫీల్ అవ్వండి, వారు ఉన్న విధంగానే వారిని అర్థం చేసుకోండి, వారికి అంతరాయం కలిగించవద్దు, మీ వంతు కోసం వేచి ఉండండి. అలాగే, ప్రశాంతంగా మరియు ఓపికగా వినండి, ఇతరులు మీతో మాట్లాడితే వారికి హాయిగా ఉండేలా చూసుకోండి. మీ వినే కళ వారు ఏమి చెబుతున్నారో, వారు ఏమి ఉద్దేశించారో, వారు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది. మీకు ప్రశ్నలు ఉన్నప్పటికీ తగిన సమయం కోసం వేచి ఉండి వినమ్రంగా ప్రశ్న అడగండి. ఇది మీ కమ్యూనికేషన్‌ను శ్రావ్యంగా, స్పష్టంగా మరియు శాంతియుతంగా ఉంచుతూ ప్రతి పరస్పర చర్య మీకు మరియు ఇతర వ్యక్తులకు ఆహ్లాదకరమైన అనుభవంగా చేస్తుంది.

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »