Hin

19th november 2024 soul sustenance telugu

November 19, 2024

మీ మనస్సు యొక్క కాన్వాస్‌పై క్షమాపణ అనే రంగు వేయడం (పార్ట్ 1)

మన జీవితంలో సన్నిహితమైన బంధాన్ని పంచుకున్న వ్యక్తుల ద్వారా మనం బాధపడినప్పుడు,  మనం తరచుగా భావోద్వేగపరంగా బలహీనపడతాము. అటువంటి పరిస్థితులలో మన యోగ్యత ప్రశ్నార్థకంగా ఉన్నట్లుగా భావిస్తాము. సృష్టించబడిన ఈ బలహీనత మనలో శూన్యతను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథం అనుసారంగా, భవిష్యత్తులో కలిగే భావోద్వేగ నష్టం లేదా బాధ యొక్క భయాలు మనల్ని కోపం మరియు ఆగ్రహాన్ని పట్టుకోవటానికి ఒప్పిస్తాయి, అందువల్ల అది బాధను సజీవంగా ఉంచుతుంది. ఇతరులను క్షమించడం మనకు ఎందుకు అంత కష్టం? గాయాన్ని సృష్టించే ప్రక్రియలో, మనల్ని బాధపెట్టిన వ్యక్తి గురించి మనం అతిగా ఆలోచిస్తాము. గాయం మోయడం వల్ల మనం ఈ పరిస్థితిలో ఖైదు చేయబడుతున్నామని తెలియక, మనం అవతలి వ్యక్తిని ఒక ఖైదీగా పట్టుకొని ఉంటాము. బాధాకరమైన పరిస్థితులలో, అద్భుతమైన స్వచ్ఛమైన ఆత్మగా మన అసలు రూపం గురించి మనం తరచుగా అవగాహన కోల్పోతాము. స్వచ్ఛమైన ఆత్మలుగా, మన నిజమైన నివాసం ఆధ్యాత్మిక ప్రపంచం, పరంధామము అని మనం గుర్తుంచుకోవాలి. మనం పరంధామము నుండి దిగివచ్చి, ప్రతి జన్మలో వేర్వేరు శారీరక దుస్తులు లేదా శరీరాలను ధరించే, తొలగించే చక్రంలోకి ప్రవేశిస్తాము. వివిధ సంబంధాల ప్రయాణంలో కొన్నిసార్లు వారిని బాధపెట్టడం ద్వారా మనం అనేక ఆత్మలతో అనేక ప్రతికూల కర్మల  ఖాతాలను సృష్టించుకుంటాము. ఆత్మిక స్మృతి ఉండటం వల్ల ఎవరైనా మనల్ని బాధపెట్టిన ప్రతి పరిస్థితి వెనుక గతంలో నేను సృష్టించిన పాత కర్మ వృత్తాంతాలను పరిష్కరించే ఉద్దేశ్యం ఉందని, అది సహజంగా ప్రమాదవశాత్తు వచ్చింది కాదని గుర్తుంచుకోవడం సులభం అవుతుంది. ఈ విభిన్న దృక్పథంతో పరిస్థితిని చూసినప్పుడు, ప్రతిదీ పరివర్తన అవ్వటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది క్షమించడాన్ని సులభతరం చేస్తుంది.

 

అనేక విధాలుగా, క్షమించే కళ అనేది మన స్వభావం లోని శాంతి, ప్రేమ మరియు సత్యం వంటి రంగుల నుండి కొత్త రంగును వేయడం లాంటిది. ఒక్క సారి మన అలవరచబడని మనసు అనే కాన్వాస్ పై తాజాగా ఈ రంగులను కలిపి క్షమాపణ అనే అందమైన రంగుని వేసినప్పుడు అవి సృజనాత్మకత, సామరస్యం మరియు సమతుల్యతతో నిండి ఉంటాయి. ఒక పెయింటింగ్లో ఎలా అయితే ఒక తుది దశ ఉండదో, సంబంధాలలో కూడా, మనం ఒక పరిపూర్ణ స్థితికి చేరుకొని శాశ్వతంగా అక్కడే ఉండలేము. క్షమాపణ అనేది ఒక సారి చేసే చర్య లేదా సంఘటన లాంటిది కాదు. అది ఒక వృత్తం లేదా నిరంతర అభివృద్ధి లాంటిది. అది కోపం లేదా చేదుతనం లేని వృత్తం, కానీ ఆనందం మరియు సత్యత ఉన్న ప్రదేశం. మనం అందులో పాల్గొనడానికి ఎంచుకోవచ్చు.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »