Hin

21st november 2024 soul sustenance telugu

November 21, 2024

మీ మనస్సు యొక్క కాన్వాస్‌పై క్షమాపణ అనే రంగు వేయడం (పార్ట్ 3)

ఒక చిత్రకారుడు, పూలతో నిండిన ఒక అందమైన తోటలో నడిచి, వాటి సువాసనను పీల్చుకున్న తరువాత, అతను పెయింటింగ్ చేస్తున్నప్పుడు కోపంగా ఉంటే, అదే చిత్రాన్ని తిరిగి సృష్టించలేడు.  జీవిత దృశ్యం యొక్క అందమైన పెయింటింగ్ ను రూపొందించడానికి, అతను భావోద్వేగపరంగా సానుకూలమైన అందానికి మరియు జీవితంలోని లయకు ఆధారమవ్వాలి. అదేవిధంగా, మనం అవతలి వ్యక్తి యొక్క విశేషతలను గుర్తుంచుకోవాలి. మనం కూడా ఇతరుల ద్వారా చాలాసార్లు క్షమించబడ్డామని, ఇది ఇచ్చి పుచ్చుకునే ప్రయాణమని, ఇందులో ఎక్కువ లేదా తక్కువ హోదా లేదని గుర్తుంచుకోవాలి.  అవతలి వ్యక్తి యొక్క ఆలోచనలు, మాటలు లేదా చర్యల స్థాయిలో చేసిన ప్రతి చిన్న పొరపాటు పట్ల ఆ సంబంధం గురించి మన ఆలోచనలు ప్రతికూలంగా ముడిపడి లేనప్పుడు, మనం వారిని వారు నిజంగా ఎవరనే దానిని చూడగలిగి వారితో అందమైన సంబంధాన్ని సృష్టించవచ్చు.

మనం క్షమించిన తర్వాత, కొత్తగా లభించిన ఈ ఆనందాన్ని, తేలికతనాన్ని మరొక ఆత్మతో పంచుకోవాలనుకుంటాం. కొత్త పెయింటింగ్ ను రూపొందించేటప్పుడు, రంగులను కాన్వాస్ పై  అసంపూర్ణంగా పూసి, ఆరిపోవాటానికి వదిలేస్తే, తరువాతి దశలో వాటిని తొలగించడం లేదా కలపడం కష్టం అవుతుంది. అదేవిధంగా, మన సద్గుణాలను మన మనస్సు అనే కాన్వాస్ పైకి వెంటనే అమలులోకి తీసుకువచ్చి ఇతరులను క్షమించడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు. లేదంటే మనము ఒక అందమైన సంబంధాన్ని కోల్పోవచ్చు. అప్పుడు తనను తాను క్షమించుకోవడానికి కూడా ఇది చాలా సుదీర్ఘమైన మరియు కష్టతరమైన ప్రయాణంగా మారుతుంది. మనం క్షమాపణ ఇచ్చేవాళ్ళం మరియు స్వీకరించేవాళ్ళం అయినప్పటికీ ఏ బాధాకరమైన పరిస్థితిలోనైనా, మనం మన పట్ల మనం కరుణతో మరియు దయతో ఉంటూ మృదువైన చర్యలు తీసుకోవాలి. సంబంధాలలో క్షమాపణను పాటించడం కీలకం, ఎందుకంటే ఇది అవతలి వ్యక్తికి మరియు మనకు కూడా సానుకూల వాస్తవికతను సృష్టిస్తుంది. ఈ విధంగా, మన భావాలను అవతలి ఆత్మతో పంచుకొని తేలికగా ఉండగలుగుతాము. అందువల్ల, క్షమాపణ అంటే కేవలం విడిచిపెట్టడం మాత్రమే కాదు, భవిష్యత్తులో జీవితం కోసం అవతలి వ్యక్తి పట్ల మరింత ప్రేమను కలిగి ఉండటం కూడా. క్షమాపణ గతాన్ని చెరిపివేయదు, కానీ ఎక్కువ కరుణ, దయ మరియు ప్రేమతో చూస్తుంది. ఇది ఆత్మను విముక్తి చేసి భయాన్ని తొలగిస్తుంది. ఇది కేవలం మరొకరికి క్షమాపణ ఇవ్వడం గురించి మాత్రమే కాదు, మన స్వంత భావోద్వేగ సంక్షేమాన్ని కూడా చూసుకోవడం కూడా. ఇది మనలో ఒక మంచి శాశ్వతమైన మార్పు. మనలోని ఆంతరిక శక్తిని గుర్తించడంతో పాటు చివరికి బేషరతుగా అంగీకరించడం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »