Hin

14th august 2024 soul sustenance telugu

August 14, 2024

మీ మాటల ప్రకంపనలను పెంచుకోండి

మనలో చాలా మందికి మన రోజువారీ సంభాషణలలో ప్రతికూలమైన మరియు తక్కువ శక్తి గల పదాలను ఉపయోగించడం అలవాటు.  ప్రతి పదానికి ఒక నిర్దిష్ట శక్తి మరియు ప్రకంపనలు ఉంటాయి. అదే మనం విశ్వంలోకి ప్రసరింపజేస్తాము. అదే శక్తిని మనం తిరిగి ఆకర్షిస్తాము. ఆ శక్తే మన భగయ్యమగా మారుతుంది. కనుక మనం మన పదజాలాన్ని చెక్ చేసి పెంచుకోవాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన మాటలు మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మీరు అలవాటుగా ఉపయోగించే పదాల ప్రభావాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటున్నారా, లేదా అవి కేవలం పదాలే కదా అని నమ్మి వాటిని తేలికగా తీసుకుంటున్నారా? కొన్ని పదాలు మీకు తక్షణమే సంతోషాన్ని, బాధని లేదా కోపాన్ని కలిగిస్తాయని మీరు అనిపిస్తుందా? మన అభిప్రాయాలను తెలియజేయడం కంటే మాటలు ముఖ్యమైనవి. మనం ఆలోచించే, మాట్లాడే లేదా వ్రాసే ప్రతి పదం ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో ప్రసరిస్తాయి. మన గురించి, ఇతరుల గురించి, ప్రదేశాల గురించి, వస్తువుల గురించి లేదా ప్రపంచం గురించి ప్రతికూల పదాలను ఉపయోగించడం మన మరియు వారి ప్రకంపనలను తగ్గిస్తుంది. స్వచ్ఛమైన, సానుకూలమైన, సాధికారిక పదాలను మాత్రమే ఉపయోగించడానికి మన పదజాలాన్ని మెరుగుపరుద్దాం. హై వైబ్రేషన్ పదాలను మాత్రమే ఉపయోగించండి. ఉన్నతమైన శక్తి మనకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా మన కంపనాలను పెంచుతుంది. మనము మరింత సానుకూలతను ఆకర్షిస్తాము. మన మాటలు మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మన మాటలను మన వ్యక్తిత్వానికి అనుగుణంగా పెంచుకుందాం.

ప్రతిరోజూ, మీ రోజువారీ సంభాషణలో స్వచ్ఛమైన, శక్తివంతమైన, సానుకూల పదాలను మాత్రమే జాగ్రత్తగా ఎంచుకోండి. మీ పదజాలాన్ని నిరంతరం మెరుగుపరుచుకోండి, మీ పదజాలాన్ని మెరుగుపరిస్తే మీ ప్రకంపనలను పెంచుతుంది. అది మీ అంతర్గత సంభాషణ అయినా లేదా మీ ఆరోగ్యం, సంబంధాలు, వృత్తి, ఆర్థిక విషయాల గురించి ఎవరితోనైనా సంభాషణ అయినా, మీరు దేని గురించి మాట్లాడినా, మీకు తెలిసిన అత్యున్నత పదజాలాన్ని ఉపయోగించండి.  శక్తివంతమైన పదాలను మాత్రమే ఉపయోగించండి- నేను సరళంగా ఉంటాను, అలవాట్లను మార్చడం నాకు సులభం, ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, నేను సమయానికి అన్ని కార్యాలు చేసేస్తాను, నేను విజయవంతమయ్యాను, అన్ని కార్యాలు ఖచ్చితంగా నేను చేస్తాను, నేను దానిని పూర్తి చేస్తాను, నేను ఎల్లప్పుడూ బాగా చేస్తాను, నా శరీరం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంది, నా భోజనం ఆరోగ్యకరమైనది మరియు రుచికరమైనది.

 నేను కోరుకున్న వాస్తవికత గురించి మాట్లాడుతున్నాను, ప్రస్తుత వాస్తవికత గురించి కాదు. నా మాటలు నా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి, అవి నాకు మరియు నా పరిస్థితికి శక్తినిస్తాయి. నా ప్రతి మాట నాకు, ఇతరులకు, పరిస్థితులకు, పర్యావరణానికి ఒక ఆశీర్వాదం. సానుకూల పదాలు మన మనస్సుపై వైద్యం చేసే ప్రభావాన్ని చూపుతాయి, మన శరీరం కూడా సానుకూలంగా స్పందిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 1)

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »