Hin

31st dec 2024 soul sustenance telugu

December 31, 2024

మీ ఉదయపు సమయ నాణ్యతను మార్చడం

మనకు మనం ఇవ్వగలిగే అతి పెద్ద బహుమతి ఏమిటంటే, మన మనస్సు మరియు శరీరాన్ని బలపర్చుకునేందుకు ఒక శక్తివంతమైన ఉదయం దినచర్యను అభివృద్ధి చేసుకోవడం. కొత్తగా ప్రారంభించడానికి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి, బహుమతి ఇచ్చే రోజు కోసం టోన్ సెట్ చేయడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం. మీ ఉదయం సాధారణంగా ఎలా ప్రారంభమవుతుంది? మీరు మీ ఇమెయిల్లను కొన్ని సార్లు చెక్ చేసుకొని, ఆపై రోజంతా హడావడిగా ఉంటారా? మీరు మేలుకున్న వెంటనే ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? మీరు తెలుసుకోకముందే, మీరు ఆలస్యం కావచ్చు. మనస్సు గందరగోళంగా మారుతుంది ఆపై శరీరం ఒత్తిడికి లోనవుతుంది. మన మనస్సు మనకు ఉన్న అన్ని పాత్రలను, బాధ్యతలను నిర్వహిస్తుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన మొదటి బాధ్యత. భగవంతునికి, మన మనస్సుకి, శరీరానికి, వ్యక్తులకు, మనం ఉపయోగించే వస్తువులకు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేయడం వంటి ఉన్నతమైన ఆలోచనలను సృష్టిస్తూ ప్రారంభించవచ్చు. రోజంతా సంతోషంగా ఉండటాన్ని విజువలైజ్ చేయడంతో పాటు కొన్ని నిమిషాల ధృవీకరణలతో మనస్సును పోషించండి. కొన్ని నిమిషాలు ధ్యానం చేసి, తరువాత కొన్ని నిమిషాలు సుసంపన్నమైన సందేశాలను చదవండి. ఇటువంటి  కార్యకలాపాలు మన అంతర్గత బ్యాటరీని ఛార్జ్ చేసి రోజంతా ఆనందాన్ని, శాంతిని అనుభవం చేసుకోవడానికి సహాయపడతాయి. క్రమబద్ధంగా ఉండండి, ఆ రోజుకి మనల్ని తయారుచేసే ఉదయపు అలవాట్లను అనుసరించడానికి స్వీయ-క్రమశిక్షణను కలిగి ఉండండి. 

 

శాంతి, ప్రశాంతత మీ సహజ సంస్కారాలు అని ప్రతి ఉదయం మీకు మీరు గుర్తు చేసుకోండి. మీరు  పరిపూర్ణమైన దినచర్యతో ప్రారంభిస్తే ప్రతి రోజూ అందంగా ఉంటుంది. ఆనందం మరియు విజయం కోసం మిమ్మల్ని మీరు ఏర్పరచుకోండి. ప్రతిరోజూ మీ ఉదయపు అలవాట్లను ఖచ్చితంగా అనుసరించండి. తాజాగా అనుభూతి చేసుకుంటూ మేల్కొనండి. మీ మనస్సు, శరీరం బాగా విశ్రాంతి తీసుకున్నాయి. మీ శరీరంలోని ప్రతి కణాన్ని సక్రియం చేస్తూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి లేదా నడవండి. అందువల్ల శరీరం రోజంతా మీ అన్ని కార్యకలాపాలకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది. సర్వశక్తిమంతుడైన భగవంతునితో అనుసంధానం అయ్యి మిమ్మల్ని మీరు, మీ మనస్సును ఉత్తేజపరచుకోవడానికి 15 నిమిషాలు ధ్యానం చేయండి. ప్రతి సన్నివేశంలో ఉపయోగించడానికి శాంతి, ఆనందం, శక్తి యొక్క మీ అంతర్గత శక్తులను ప్రేరేపించండి. సంస్కారాన్ని మార్చుకోవడం, ఎవరినైనా క్షమించడం, గతాన్ని మరచిపోవడం, ఎవరితోనైనా మంచిగా ఉండటం వంటి పనులతో కూడా రోజులో మీపై మీరు పని చేసుకోండి. ఎంచుకోండి, నిర్ణయించండి మరియు అమలు చేయండి. మీ మనస్సు స్వచ్ఛమైన, పరిపూర్ణమైన ఆలోచనలను సృష్టించడానికి సహాయపడేందుకు 15 నిమిషాలు ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాలను చదవండి. మొదటి గంట సోషల్ మీడియా లేదా ఇమెయిల్ సందేశాలను చెక్ చేయవద్దు, వార్తాపత్రికలు చదవవద్దు లేదా వార్తలు చూడవద్దు. మీ ఉదయం సమయం మీ పోషణ కోసం కేటాయించిన సమయం. ఇదంతా చేయడంతో రోజంతా మీ మానసిక స్థితి, శక్తి, వైఖరి మరియు సమర్థతలో భారీ మార్పును చూస్తారు.

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »