Hin

24th march 2025 soul sustenance telugu

March 24, 2025

మెడిటేషన్ అనే బ్రహ్మ ముడి (పార్ట్ 3)

ప్రాక్టికల్ మెడిటేషన్ అనేది కేవలం ఉదయం రోజును ప్రారంభించే ముందు లేదా రాత్రి నిద్రురించే ముందు చేసేటువంటిది మాత్రమే కాదు, మీరు  మీ దినచర్యలో ఉన్నప్పుడు కూడా చేసేటువంటిది. వాస్తవానికి, ఇది రోజులోని అన్ని పాజిటివ్ కర్మలకు గట్టి పునాది. మీ పాజిటివ్ ఆలోచనలు  మరియు మెడిటేషన్ యొక్క దివ్యమైన బొడ్డు తాడు ద్వారా మీ ఆత్మిక తల్లి లేదా పరమాత్ముని నుండి ఏడు దివ్య గుణాలతో స్వయాన్ని నింపాలి. అప్పుడే మీరు ఇతరులకు అవే సుగుణాలను ప్రసరింపజేస్తారు. తరచుగా, రోజులో నెగిటివ్ కర్మలు జరగడానికి ముఖ్య కారణం ఆ పరమాత్మునితో దివ్యమైన పవిత్రమైన కనెక్షన్ దృఢంగా ఉండకపోవడం. మరో మాటలో చెప్పాలంటే,మెడిటేషన్ అనే బొడ్డుతాడు  కట్ అవ్వడానికి కారణం మనం మన కర్మలలో చాలా బిజీ అవుతూ పరమాత్మున్ని మర్చిపోవడం.అలాగే, మనం మన దినచర్యలో నిమగ్నమై, కర్మలు చేస్తున్నప్పుడు, ఉదయం ధ్యానంలో మనకు ఏర్పడిన  బలహీనపడుతుంది. కాబట్టి, ఇతరులు మన నుండి మంచిని పొంది  తిరిగి మనల్ని ప్రేమించాలంటే, రోజంతా ఆత్మికత  అనే గుహలో ఉండి, భగవంతుని నుండి దాని ప్రయోజనాలను గ్రహించడం చాలా అవసరం.


అలాగే, ఈ సుందరమైన మరియు పవిత్రమైన భగవంతుని  ఒడి మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది.  సమయం గడిచేకొద్దీ, ధ్యానం చేయడం మరియు మన ఆత్మిక స్పృహను ఆయనపై కేంద్రీకరించడం ద్వారా మనం మంచి మానవులుగా అవుతాము. మనమందరం ఆయనను తండ్రిగా ప్రేమిస్తాము. కానీ వారు ఆత్మలందరి తల్లి. ఈ తల్లిలో  అనంతమైన శాంతి, ప్రేమ మరియు శక్తితో నిండి ఉన్నాయి. భౌతిక తల్లి యొక్క ఈ ప్రత్యేకతలు మనమందరం పెరిగిన మరియు అనుభవించిన వారినే. ప్రపంచంలోని అత్యంత సుందరమైన మరియు స్వచ్ఛమైన సంబంధాలలో తల్లి పిల్లల సంబంధం.  కాబట్టి, భగవంతుడు ఆత్మకు తల్లి. ఆత్మిక సంతానమైన నా పట్ల వారి ప్రేమ బిడ్డ అయిన నా పట్ల వారి ప్రేమ ప్రపంచంలోనే అత్యున్నతమైనది. కాబట్టి, ఈ అత్యంత సుందరమైన మరియు ప్రేమగల అవినాశి తల్లి యొక్క సహవాసాన్ని ఆనందించండి. అంటే ధ్యానంలో భగవంతుని స్మరించండి మరియు ఆయన ప్రేమను మరియు మంచితనాన్ని మొత్తం విశ్వానికి ప్రసరింపజేయండి.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »