Hin

20th April 2025 Soul Sustenance Telugu

April 20, 2025

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

(నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)

 

ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల ద్వారా నా విభిన్న పాత్రలను పోషించడానికి నేను భౌతిక ప్రపంచంలో ఇక్కడ నుండి వచ్చాను.

 

ఈ ప్రదేశం నాకు గుర్తుంది…

 

నేను దానిని మర్చిపోయాను, కానీ ఇప్పుడు నేను దానిని తిరిగి కనుగొన్నాను……

 

ఈ శాంతిధామంలో నా ముందు నా లాంటి ప్రకాశవంతమైన ఒక జ్యోతిర్బిందువు ఉంది, కానీ అది  నా కంటే చాలా దివ్యమైన ప్రకాశంతో ఉంది…….

 

నేను ఈ దివ్య ప్రకాశానికి మరింత దగ్గరవుతాను మరియు ఆ అందమైన ప్రకాశానికి ఆకర్షితులవుతాను,

 

పరమ జ్యోతి స్వరూపుడు కూడా నన్ను తన వైపుకు స్వాగతించుతున్నారు……..

 

భగవంతుడు, పరమ ఆత్మ లేదా పరమ పిత అన్ని వైపులకు మరియు నాపై అపరిమిత శాంతి కాంతి యొక్క బంగారు కిరణాలను ప్రసరింపజేస్తున్నారు…….

 

వారు శాంతి సాగరుడు, మొత్తం ప్రపంచానికి శాంతి యొక్క అత్యున్నత మూలం….

 

నేను, ఆత్మ, బంగారు ఆధ్యాత్మిక నక్షత్రాన్ని, నా మీద పడే ఈ శాంతి కిరణాలను అనుభూతి చేస్తున్నాను, 

నేను ఈ మధురమైన శాంతి యొక్క కాంతిని లోతుగా గ్రహిస్తున్నాను….

 

నేను ఈ బంగారు ప్రశాంతమైన కాంతి కింద స్నానం చేస్తున్నాను……..

 

నా భారాలన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి……

 

ఇది చాలా తేలికగా, ప్రశాంతంగా మరియు ఆహ్లాదంగా ఉంది……

 

ఈ సానుకూల ఆధ్యాత్మిక అనుభూతిలో కొన్ని నిమిషాలు గడపండి, ఆపై మీరు పైకి ఎగిరిన విధంగానే క్రమంగా మీరే క్రిందికి వచ్చి, మీ నుదిటి మధ్యలో భౌతిక శరీరంలో తిరిగి కూర్చున్నట్లు విజువలైజ్ చేసుకోండి. నిన్నటి మరియు నేటి సందేశంలో వివరించిన విధంగా మెడిటేషన్ లేదా విజువలైజేషన్ వ్యాయామం శాంతి యొక్క సుగుణం కోసం. ఆత్మ యొక్క ఇతర ఆరు సుగుణాలకు కూడా ఇదే విధమైన ధ్యానాలను అభ్యసించవచ్చు-ఆనందం, ప్రేమ, సంతోషం, స్వచ్ఛత, శక్తి మరియు సత్యత వంటి గుణాలను మనం శాంతి సుగుణం కోసం సృష్టించినట్లుగా ఆరు సుగుణాల యొక్క ఆలోచనలను సృష్టించడం ద్వారా, అన్ని విభిన్న సుగుణాల యొక్క లోతైన అనుభూతిని పొందవచ్చు.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »