Hin

28th june 2025 soul sustenance telugu

June 28, 2025

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

  1. ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి అని సంకల్పం చేయండి. ఇది మీ మెడిటేషన్ ను సుందరంగా మరియు మీ మనస్సు- బుద్ధిని కేంద్రీకృతం చేస్తుంది.
  2. ఆలోచించడం మరియు విజువలైజేషన్ ఒకే సారి చేయండి – మెడిటేషన్ యొక్క చాలా ముఖ్యమైన సూత్రం ఏమిటంటే,  మనస్సులో ఆత్మ మరియు భగవంతుని యొక్క జ్ఞానంతో పాజిటివ్, శక్తివంతమైన ఆలోచనలను రచించడము మరియు అదే సమయంలో వాటిని మీ బుద్ధి నేత్రంతో విజువలైజ్ చేయడం. తద్వారా ఏకాగ్రత సులభమైన మరియు సహజమైన ప్రక్రియగా మారి మంచి అనుభవాలు పొందుతారు.
  3. మీ కళ్ళు సగం తెరిచి ఉంచండి, కళ్ళు మూయకండి – మెడిటేషన్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలలో ఒకటి, మీరు మీ కళ్ళు పూర్తిగా మూసుకోకూడదు. ఇది ఆత్మ మరియు పరమాత్మ యొక్క అనుభూతి కలగకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. ప్రశాంతమైన ఆలోచనలను చేసినప్పుడు మీరు నిద్రలోకి జారుకొని మెడిటేషన్ యొక్క లోతులను అనుభవించలేరు.
  4. మంచి భావనతో మెడిటేషన్ లో ఫ్రెష్ గా కూర్చోండి – నిద్ర యొక్క ఫీలింగ్ తో మరియు ఎటువంటి లక్ష్యం లేకుండా మెడిటేషన్ చేయకూడదు. కాబట్టి మెడిటేషన్ చేయడానికి ముందు, మంచి ఏకాగ్రత కలిగి ఉండాలనే దృఢ నిశ్చయంతో ఎల్లప్పుడూ మెడిటేషన్ లో కూర్చోండి. తద్వారా మీకు కావలసిన విధంగా ఫ్రెష్ అప్ అవగలుగుతారు. మనస్సు మరియు శరీరం యొక్క తాజాదనం విజయాన్ని తెస్తుంది.
  5. బ్యాక్‌గ్రౌండ్‌లో సాఫ్ట్ మరియు జెంటిల్ మ్యూజిక్ ప్లే చేయండి – మెడిటేషన్‌లో మనస్సుకు ఓదార్పు ఇవ్వడానికి ఒక మంచి మార్గం మృదువైన మరియు సున్నితమైన మెడిటేషన్ మ్యూజిక్ ని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం. అలాగే, మీరు మనస్సుకు దిశానిర్దేశం చేయడానికి,  మనస్సు భ్రమించకుండా ఉండటానికి మృదువైన మెడిటేషన్ కామెంటరీ ని పెట్టుకోవచ్చు. మీరు నిశ్శబ్దాన్ని ఇష్టపడితే, ఏదీ పెట్టుకొనే అవసరం లేదు.

(సశేషం)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »