Hin

2nd dec 2023 soul sustenance telugu

December 2, 2023

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

  1. ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి అని సంకల్పం చేయండి. ఇది మీ మెడిటేషన్ ను సుందరంగా మరియు మీ మనస్సు- బుద్ధిని కేంద్రీకృతం చేస్తుంది.
  2. ఆలోచించడం మరియు విజువలైజేషన్ ఒకే సారి చేయండి – మెడిటేషన్ యొక్క చాలా ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, మనస్సులో ఆత్మ మరియు భగవంతుని యొక్క జ్ఞానంతో పాజిటివ్, శక్తివంతమైన ఆలోచనలను రచించడము మరియు అదే సమయంలో వాటిని మీ బుద్ధి నేత్రంతో విజువలైజ్ చేయడం. తద్వారా ఏకాగ్రత సులభమైన మరియు సహజమైన ప్రక్రియగా మారి మంచి అనుభవాలు పొందుతారు.
  3. మీ కళ్ళు సగం తెరిచి ఉంచండి, కళ్ళు మూయకండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలలో ఒకటి, మీరు మీ కళ్ళు పూర్తిగా మూసుకోకూడదు. ఇది ఆత్మ మరియు పరమాత్మ యొక్క అనుభూతి కలగకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. ప్రశాంతమైన ఆలోచనలను చేసినప్పుడు మీరు నిద్రలోకి జారుకొని మెడిటేషన్ యొక్క లోతులను అనుభవించలేరు.
  4. మంచి భావనతో మెడిటేషన్ లో ఫ్రెష్ గా కూర్చోండి – నిద్ర యొక్క ఫీలింగ్ తో మరియు ఎటువంటి లక్ష్యం లేకుండా మెడిటేషన్ చేయకూడదు. కాబట్టి మెడిటేషన్ చేయడానికి ముందు, మంచి ఏకాగ్రత కలిగి ఉండాలనే దృఢ నిశ్చయంతో ఎల్లప్పుడూ మెడిటేషన్ లో కూర్చోండి. తద్వారా మీకు కావలసిన విధంగా ఫ్రెష్ అప్ అవగలుగుతారు. మనస్సు మరియు శరీరం యొక్క తాజాదనం విజయాన్ని తెస్తుంది.
  5. బ్యాక్‌గ్రౌండ్‌లో సాఫ్ట్ మరియు జెంటిల్ మ్యూజిక్ ప్లే చేయండి – మెడిటేషన్‌లో మనస్సుకు ఓదార్పు ఇవ్వడానికి ఒక మంచి మార్గం మృదువైన మరియు సున్నితమైన మెడిటేషన్ మ్యూజిక్ ని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం. అలాగే, మీరు మనస్సుకు దిశానిర్దేశం చేయడానికి, మనస్సు భ్రమించకుండా ఉండటానికి మృదువైన మెడిటేషన్ కామెంటరీ ని పెట్టుకోవచ్చు. మీరు నిశ్శబ్దాన్ని ఇష్టపడితే, ఏదీ పెట్టుకొనే అవసరం లేదు.

 

సశేషం….

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th october 2024 soul sustenance telugu

అహంకారం లేకుండా నొక్కిచెప్పడం

కుటుంబంలో మరియు కార్యాలయంలో మన వేర్వేరు పాత్రలలో, కావాల్సిన ఫలితాలను పొందేందుకు వ్యక్తులను ప్రభావితం చేయడానికి మనం దృఢంగా ఉండాలి. మన అభిప్రాయాలను మర్యాదగా చెప్పడానికి, ఇతరులను గౌరవించడానికి, ఖచ్చితంగా ఉంటూ మార్పుకు అనువుగా

Read More »
13th october 2024 soul sustenance telugu

భగవంతుని 5 గొప్ప విశేషతలు

అందరూ భగవంతుడిగా ఒప్పుకునేవారు – భారతదేశంలో అనేకులు దేవి దేవతలను పూజిస్తారు. భారతదేశం వెలుపల, వివిధ మత పెద్దలను చాలా గౌరవంతో పూజిస్తారు. కానీ భగవంతుడు నిరాకారుడైన పరమ జ్యోతి. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండే

Read More »
12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »