Hin

29th june 2025 soul sustenance telugu

June 29, 2025

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2)

  1. ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్మృతి ఉండడం.  స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.  ఇతరులను కూడా ఆత్మగా చూస్తూ, వారి నిజ గుణాలను గుర్తుంచుకోవడం. ఆత్మ యొక్క స్పృహ మన చర్యలోకి ఎంత ఎక్కువగా తెస్తామో, అంత మన మెడిటేషన్ మరింత మంచిగా మరియు శక్తివంతంగా ఉంటుంది.
  2. దివ్యతతో నిండిన మంచి అలవాట్లను అలవర్చుకోండి – మెడిటేషన్ లో భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి, స్వచ్ఛమైన మరియు దివ్యమైన మనస్సు- బుద్ధి కలిగి ఉంటూ ఇతరులకు ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో దివ్యత్వాన్ని ప్రసరింపజేయడం చాలా ముఖ్యం. రోజంతా ఈ వైబ్రేషన్స్ తో మనల్ని మనం ఎంత ఎక్కువగా నింపుకుంటామో, అంతగా మనం భగవంతుని వైపు ఆకర్షించబడతాము.
  3. భగవంతుని స్మరణలో వండిన స్వచ్ఛమైన మరియు తాజా శాఖాహారం తినండి – “ఆహారాన్ని బట్టి మనసు” అనే సూత్రం ఆధ్యాత్మికతలో చాలా ముఖ్యమైనది.  మనం తినే ఆహారం యొక్క వైబ్రేషన్స్ ని  బట్టి, మన మనస్సు అదే విధమైన శక్తితో నిండుతుంది.  అందుకే భగవంతుని స్మరణలో శాకాహారాన్ని వండుకుని తినడం మెడిటేషన్ కి ఎంతగానో ఉపకరిస్తుంది.
  4. మెడిటేషన్ యొక్క సుందరమైన అనుభూతి కోసం రాత్రి వేళల తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి – ఉదయం మెడిటేషన్ లో సుందరమైన అనుభూతి కలగడానికి  ముందు రోజు రాత్రి తేలికైన ఆహారాన్ని ముందుగానే తీసుకోవాలి. ఇది మీ మనస్సు, మెదడు మరియు శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. మీరు పరంధామానికి మీ మనస్సుతో సులభంగా ప్రయాణించగలరు, ఎటువంటి భౌతిక శక్తి మిమ్మల్ని క్రిందికి లాగకుండా ఉంటుంది.
  5. చక్కగా మరియు సరిపడేంత సమయం నిద్రపోండి – చక్కటి ప్రశాంతమైన నిద్ర ఆధ్యాత్మిక జీవనశైలిలో చాలా ముఖ్యమైన అంశం. చాలా తక్కువ నిద్రపోవడం వల్ల మీ మెదడు బరువుగా అయ్యి శరీరం అలసిపోతుంది. ఎక్కువ నిద్రపోవడం మిమ్మల్ని సోమరులుగా  చేస్తుంది. కాబట్టి, కలలు లేని మంచి నిద్రను పొందడానికి నిద్రపోయే ముందు మీ ఆలోచనలన్నింటినీ సర్దుకుని, మీ భారాలన్నింటినీ భగవంతునికి అప్పగించండి మరియు మెడిటేషన్ మంచిగా ఉండేందుకు తాజాగా మేల్కొండి. 

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »