Hin

3rd Dec 2023 Soul Sustenance Telugu

December 3, 2023

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

  1. ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం. ఇతరులను కూడా ఆత్మగా చూస్తూ, వారి నిజ గుణాలను గుర్తుంచుకోవడం. ఆత్మ యొక్క స్పృహ మన చర్యలోకి ఎంత ఎక్కువగా తెస్తామో, అంత మన మెడిటేషన్ మరింత మంచిగా మరియు శక్తివంతంగా ఉంటుంది.
  2. దివ్యతతో నిండిన మంచి అలవాట్లను అలవర్చుకోండి – మెడిటేషన్ లో భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి, స్వచ్ఛమైన మరియు దివ్యమైన మనస్సు- బుద్ధి కలిగి ఉంటూ ఇతరులకు ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో దివ్యత్వాన్ని ప్రసరింపజేయడం చాలా ముఖ్యం. రోజంతా ఈ వైబ్రేషన్స్ తో మనల్ని మనం ఎంత ఎక్కువగా నింపుకుంటామో, అంతగా మనం భగవంతుని వైపు ఆకర్షించబడతాము.
  3. భగవంతుని స్మరణలో వండిన స్వచ్ఛమైన మరియు తాజా శాఖాహారం తినండి – ఆహారాన్ని బట్టి మనసు” అనే సూత్రం ఆధ్యాత్మికతలో చాలా ముఖ్యమైనది. మనం తినే ఆహారం యొక్క వైబ్రేషన్స్ ని బట్టి, మన మనస్సు అదే విధమైన శక్తితో నిండుతుంది.  అందుకే భగవంతుని స్మరణలో శాకాహారాన్ని వండుకుని తినడం మెడిటేషన్ కి ఎంతగానో ఉపకరిస్తుంది.
  4. మెడిటేషన్ యొక్క సుందరమైన అనుభూతి కోసం రాత్రి వేళల తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి ఉదయం మెడిటేషన్ లో సుందరమైన అనుభూతి కలగడానికి ముందు రోజు రాత్రి తేలికైన ఆహారాన్ని ముందుగానే తీసుకోవాలి. ఇది మీ మనస్సు, మెదడు మరియు శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. మీరు పరంధామానికి మీ మనస్సుతో సులభంగా ప్రయాణించగలరు, ఎటువంటి భౌతిక శక్తి మిమ్మల్ని క్రిందికి లాగకుండా ఉంటుంది.
  5. చక్కగా మరియు సరిపడేంత సమయం నిద్రపోండి – చక్కటి ప్రశాంతమైన నిద్ర ఆధ్యాత్మిక జీవనశైలిలో చాలా ముఖ్యమైన అంశం. చాలా తక్కువ నిద్రపోవడం వల్ల మీ మెదడు బరువుగా అయ్యి శరీరం అలసిపోతుంది. ఎక్కువ నిద్రపోవడం మిమ్మల్ని సోమరులుగా చేస్తుంది. కాబట్టి, కలలు లేని మంచి నిద్రను పొందడానికి నిద్రపోయే ముందు మీ ఆలోచనలన్నింటినీ సర్దుకుని, మీ భారాలన్నింటినీ భగవంతునికి అప్పగించండి మరియు మెడిటేషన్ మంచిగా ఉండేందుకు తాజాగా మేల్కొండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »
11th May 2025 Soul Sustenance Telugu

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ

Read More »
10th May 2025 Soul Sustenance Telugu

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు: – గతం మరియు – వ్యక్తులు ఇది మనల్ని ఎదో ఒక రకంగా

Read More »