Hin

28th may 2025 soul sustenance telugu

May 28, 2025

మెడిటేషన్ – స్వీయ పరివర్తన కోసం సులభమైన విధి (పార్ట్ 1)

మెడిటేషన్ గురించి చర్చించేటప్పుడు, అది అభ్యసించడం అంత సులభం కాదని, ఒకరు వృద్ధులై, ప్రాపంచిక కర్తవ్యాల నుండి విముక్తి పొందినప్పుడు దానిని అభ్యసించాలని మనం తరచుగా అనుకుంటాము మరియు ఇతరుల నుండి కూడా వింటాము. అలాగే, మెడిటేషన్ మిమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచి మీ సంబంధాలలో ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉంచుతుందని కొందరు భావిస్తారు. మెడిటేషన్ మీ ప్రాపంచిక సమయాన్ని వృధా చేస్తుందని మరియు ఇంట్లో లేదా మీ కార్యాలయంలో లేదా మీరు క్రమం తప్పకుండా మీ సమయాన్ని ఇచ్చే ఇతర కార్యకలాపాలలో మీ పనులన్నింటినీ పూర్తి చేయడం మీకు కష్టంగా ఉంటుందని భావించే కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ సందేశంలో ధ్యానం మన జీవితం మీద తీసుకురాగల పరిమితుల గురించి మనం నమ్మే నిజాన్ని తెలుసుకుందాం – 

 

మెడిటేషన్ సులభం మరియు ఎవరైనా సాధన చేయవచ్చు

బ్రహ్మా కుమారీస్ బోధించే మెడిటేషన్ ఆత్మ జాగృతికి చాలా సులభమైన పద్ధతి, దీనిలో మనం మనస్సును శాంతి చేయడానికి అలసిపోయే, అసహజమైన మరియు చాలా కాలం పాటు విజయవంతంగా అభ్యసించలేని ఏ శక్తిని ఉపయోగించము. అలాగే, మనం రోజులో బిజీగా ఉన్నప్పుడు మరియు మనస్సులో చాలా ఆలోచనలు ఉన్నప్పుడు కర్మల మధ్యలో అటువంటి బలవంతమైన స్థిరత యొక్క పద్ధతిని ఉపయోగించలేము. బదులుగా, మెడిటేషన్లో మనం శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి, జ్ఞానం, సంతృప్తి, నిశ్చయం, మాధుర్యత, సహనం, నిర్లిప్తతత వంటి గుణాలపై ఆధ్యాత్మిక అవగాహన ఆధారంగా కొన్ని సానుకూల ఆలోచనలు సృష్టిస్తాం. ఇవి ఈ సద్గుణాలపై ఆధారపడి ఉంటాయి. ఈ ఆలోచనలను సృష్టించడం సులభం మరియు ఏ ఆలోచనలను సృష్టించాలో బ్రహ్మా కుమారీస్ ఆధ్యాత్మిక జ్ఞానంలో బోధించబడుతుంది. మనం ఈ సానుకూల ఆలోచనలను సృష్టించినప్పుడు, మన మానసిక స్థితి మారుతుంది మరియు మన ప్రతికూల ఆలోచనలు ఎటువంటి ప్రయత్నం లేకుండా ఆగిపోతాయి. మనస్సు ఏకాగ్రతకు ఇది సులభమైన పద్ధతి,  ఎవరైనా దీన్ని సులభంగా అభ్యసించవచ్చు.

(సశేషం…)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »