Hin

29th may 2025 soul sustenance telugu

May 29, 2025

మెడిటేషన్ – స్వీయ పరివర్తన కోసం సులభమైన విధి (పార్ట్ 2)

మెడిటేషన్ అనేది భగవంతుని సన్నిహితతకు సంబంధించిన ఒక అనుభూతి

మెడిటేషన్ అనేది ఏకాగ్రత వ్యాయామం అని, జీవితంలో సానుకూలతను అనుభూతి చేసే పద్ధతి అని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ మెడిటేషన్ దానికంటే చాలా ఎక్కువ. ఇది భగవంతునితో ఉండే సంబంధం యొక్క అనుభూతి మరియు వారి ప్రేమ, సాన్నిహిత్యం యొక్క అనుభూతి. కాబట్టి, ధ్యానం మిమ్మల్ని మౌనంగా మరియు లోకానికి దూరంగా మార్చేస్తుంది అనే సాధారణ అభిప్రాయం సరైంది కాదు. ఎందుకంటే మన జీవితంలో భగవంతుని అందమైన సంబంధాన్ని అనుభూతి చేసినపుడు, మనం శాంతి, ప్రేమ మరియు ఆనందం వంటి అన్ని అందమైన భావోద్వేగాలతో నిండి ఉంటాము, ఇది మనల్ని సువాసన గల గులాబీ పువ్వు లాగా చేస్తుంది, ఇది ఈ మంచితనాన్ని మరియు ఈ భావోద్వేగాలను ఇతరులకు కూడా ప్రసరింపజేస్తుంది. మన జీవితాల్లో వివిధ వయసుల వ్యక్తులు, విభిన్న సంబంధాలలో ఉన్న వ్యక్తులు మనకు దగ్గరవుతారు. మనం పంచుకునే వాటిని కూడా వారు అనుభూతి చేస్తారు, మన సంబంధాలు మరింత సంతృప్తికరంగా మారుతాయి. మనం సానుకూల శక్తితో వ్యక్తులకు కనెక్ట్ అవుతాము మరియు మనలో సహకార శక్తి పెరుగుతుంది, మనం కలిసి చేసే ప్రతి పనిని ఆసక్తికరంగా మరియు విజయంతో నిండి ఉంటుంది.

 

మెడిటేషన్ మనల్ని తక్కువ హడావిడిగా కానీ మరింత సమర్థవంతంగా చేస్తుంది

కొంతమంది మెడిటేషన్ని తరచుగా మీ క్రియాశీలతను తగ్గించి, జీవితంలోని ఏ రంగంలోనైనా సమర్థవంతంగా పనిచేసే సాధారణ మార్గాల నుండి మిమ్మల్ని వేరుచేసేదిగా చూస్తారు. కానీ ఈ సాధారణ నమ్మకానికి విరుద్ధంగా, మెడిటేషన్ మీ పని విధానాన్ని మెరుగుపరచడమే కాకుండా, దానిని అభ్యసించడం ద్వారా మీ ఆలోచనలు తగ్గి మీ మనస్సు మరింత వ్యవస్థీకృతం అయినప్పుడు, మీరు తక్కువ హడావిడిగా ఉంటారు మరియు మీరు తక్కువ సమయంలో ఎక్కువ పనులను చేయగలుగుతారు. అలాగే, అదే సమయంలో మీరు పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటారు. మీ ఆరోగ్యం మరియు సంబంధాలు కూడా మెరుగుపడతాయి. దీనికి చాలా ఆచరణాత్మక ఉదాహరణలు ఉన్నాయి మరియు బ్రహ్మా కుమారీస్ నేర్పించే మెడిటేషన్ విధిని అభ్యసించే చాలా మంది వ్యక్తులు తమ ఇంటి పనులను అలాగే కార్యాలయ పనులను నిర్వహించే విధానం వారిపై మరియు ఇతరులపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా, మునుపటి దానితో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం ద్వారా ఎక్కువ విజయం సాధించి, వారి పనులను నిర్వహించడం కూడా మెరుగ్గా ఉందని వ్యక్తులు ప్రశంసించారు.

(సశేషం…)

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »