Hin

9th mar 2024 soul sustenance telugu

March 9, 2024

 మీ ఆలోచనలే మీ సంబంధాలను నిర్మిస్తాయి

నేడు మన ప్రియమైన వారిని సంతోషంగా ఉంచడానికి ఎంతో చేస్తున్నాము. ఖరీదైన బహుమతులు, విహారయాత్రలు, షాపింగ్‌లు మరియు విందు భోజనాలు ఇస్తునప్పటికీ, మన  సంబంధాలు బలహీనపడుతున్నాయి. పదాలు మరియు ప్రవర్తనల కంటే ఇతర వ్యక్తి కోసం చేసే మన ప్రతి ఆలోచన ద్వారానే  సంబంధాలు నిర్మించబడటం దీనికి కారణం. మీరు సంబంధం యొక్క బలాన్ని  ఎలా అంచనా వేస్తారు? అవతలి వ్యక్తి మీతో ఎలా మాట్లాడుతున్నారు, లేదా మీరు ఎలా స్పందిస్తారు లేదా మీరు ఎంతకాలం కలిసి ఉన్నారు? అనే దన్ని బట్టి అంచనా వేస్తారా? ఒకరి కోసం మరొకరి ఆలోచనా విధానాలను ఎలా ఉన్నాయి అనేదే అంచనా వేయడానికి సులభమైన మార్గం. మన ఆలోచనలు మన మధ్య ఉన్న బంధాన్ని నిర్ణయిస్తాయి. ఇతరుల గురించి మాట్లాడటం లేదా సరిగ్గా ప్రవర్తించడం కంటేవారి పట్ల సరైన ఆలోచన కలిగి ఉండడం  చాలా ముఖ్యం. మనం ఆలోచనల్లో వారి గురించి బాధను లేదా కోపాన్ని కలిగి ఉండి, మధురమైన మాటలు మాట్లాడితే, విరుద్ధమైన భావాల ప్రకంపనలు ప్రసరించి మన బంధాన్ని బలహీనపరుస్తాయి. మన ఆలోచనా విధానం పట్ల శ్రద్ధ చూపకపోతే, ఇతరులను విమర్శిస్తూ లేదా నిందిస్తూ నకారాత్మక ప్రకంపనలు ప్రసరింపజేస్తాము. అందుకే మనం మంచిగా ఉండటానికి బాహ్య ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరితో మంచి సంబంధాలను పెంచుకోవడంలో విఫలమవుతాము. మనం  వ్యక్తుల మంచితనంపై దృష్టి పెట్టి,  వారి కోసం శుద్ధ సంకల్పాలు  చేయడం నేర్చుకున్నప్పుడు, మన మాటలు మరియు ప్రవర్తన స్వతహాగా సరైనవిగా ఉంటాయి.  “నాకు పరిపూర్ణ సంబంధాలు ఉన్నాయి. ఇతరుల  కోసం నా ప్రతి ఆలోచన వారికి ఆశీర్వాదం.” అని మీకు మీరే గుర్తు చేసుకోండి.

 

వ్యక్తుల కోసం స్వచ్ఛమైన మరియు గౌరవప్రదమైన ఆలోచనల ఆధారంగా బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీ మనస్సును ప్రోగ్రామ్ చేయండి. మీ స్వచ్ఛతను మీ సంబంధాలలో ప్రవహించనివ్వండి. మీ పరస్పర చర్యలు ప్రేమ మరియు సంరక్షణ ఆలోచనలపై ఆధారపడినప్పుడు, మీ, కరుణ, సర్దుబాటు మరియు సహన శక్తులు పెరుగుతాయి. “నేను స్వచ్ఛమైన ఆత్మను. నా సంబంధాలలో అందరి మంచి కోసం ఆలోచించి అందరినీ ఆశీర్వదిస్తాను అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »
21st jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 1)

మనమందరం మన ముందు ఎల్లప్పుడూ వివిధ రకాల సవాళ్లతో మన జీవితాలను గడుపుతాము. మనమందరం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే సవాళ్లలో లేదా మన పిల్లలు ఎదుర్కొనే అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి పాఠశాల

Read More »
20th jan 2025 soul sustenance telugu

మీ సంకల్పశక్తి మీకు అతిపెద్ద బలం

మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నా, సరైన ఆహారానికి కట్టుబడి ఉండాలనుకున్నా, వ్యసనాన్ని వదులుకోవాలనుకున్నా లేదా ఆరోగ్యకరమైన అలవాటును కొనసాగించాలనుకున్నా, విజయం లేదా వైఫల్యాన్ని మన సంకల్ప శక్తికి ఆపాదించుకుంటాము. కొన్నిసార్లు మనం అత్యధిక సంకల్ప

Read More »