Hin

1st dec 2023 soul sustenance telugu

December 1, 2023

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము. భవిష్యత్తులో మన కోరికలు నెరవేరే సమయం వరకు ఆనందం వాయిదా వేయడం ద్వారా, మన లక్ష్యం నెరవేరకపోతే ఎలా అనే ఆందోళనతో మన వర్తమానాన్ని గడుపుతాము. భయం ఉన్న చోట ఆనందం ఉండదు.

మీ లక్ష్యాలను సాధించేటప్పుడు, మీ ప్రయాణంలో ఆనందాన్ని పొందడానికి మీరు మీ మనసుకు ఎలా శిక్షణ ఇవ్వాలో చూడండి.

సంకల్పం : నేను సంతోషకరమైన వాడిని. జీవితంలోని ప్రతి సీన్ లో నేను సంతోషంగా ఉంటాను. నేను చాలా పాత్రలు పోషిస్తున్నాను…నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి…ఎన్నో లక్ష్యాలను పెట్టుకుంటాను… వాటన్నింటి కోసం అన్నీ చేస్తూ నా మానసిక స్థితిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను…నేను సంతోషంగా ఉంటూ అన్నీ చేస్తాను. నా ఆనందం నా విజయాలు, ఆస్తులు లేదా సంబంధాలపై ఆధారపడి ఉండదు. నా లక్ష్యాన్ని చేరుకునే వరకు నేను ఆనందాన్ని వాయిదా వేయను. నేను ఆనందం కోసం ఎదురు చూడను…దాని కోసం వెతకను…వెంట పడను…డిమాండ్ చేయను…వాయిదా వేయను …లేదా దానిని ఒక విజయంతో ముడిపెట్టను. ఆనందం నాలో ఉంది…నేను ఆనందంగా ఉండాలని ఎన్నుకున్నాను…ఆనందం నా రచన. వ్యక్తుల ప్రవర్తనలు  ఎలా ఉన్నా…పరిస్థితులు ఎలా ఉన్నా …నేను ఆనందంగానే ఉంటాను. ఆనందంగా ఉంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాను… ఆనందంగా ఉంటూ లక్ష్యం కోసం పని చేస్తాను…లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత కూడా నేను సంతోషంగా ఉంటాను.

సంతోషం అనేది నా ఆలోచనా విధానంలో ఉంటుంది…నా సంతోషం నా పరిస్థితులకు ప్రసరిస్తుంది…పాజిటివ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది…నన్ను విజయవంతం చేస్తుంది. నేను నా లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా, నేను సంతోషంగా ఉంటాను…నా మానసిక స్థితి బాహ్యమైన వాటిపై ఆధారపడదు. సంతోషంగా ఉండటానికి నేను ఏమీ చేయనవసరం లేదు…నేను సంతోషకరమైన జీవిని.

మీ ఆనందాన్ని వాయిదా వేయకుండా ఉండటానికి ఈ సంకల్పాన్ని కొన్ని సార్లు రిపీట్ చేయండి. మీరు మీ ఆనందానికి బాధ్యత వహించినప్పుడు, మీరు చేసే ప్రతి పనిలో మీరు ఆనందాన్ని పొందుతారు. మీరు ప్రతి అనుభవాన్ని అభినందిస్తారు మరియు మీ పాజిటివిటీ ను పెంచుతారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »
11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »