Hin

7th dec 2023 soul sustenance telugu

December 7, 2023

మీ అంతరాత్మ చెప్పేది వినడం అభ్యసించండి

మన మనస్సు ప్రశాంతంగా, బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన అంతరాత్మ చైతన్యవంతమవుతుంది. అంతరాత్మనే అంతర్ బుద్ధి లేదా 6th సెన్స్ అని కూడా అంటారు. అంతరాత్మ మన పంచ కర్మేంద్రియాలకు అందని అంతర్గత జ్ఞానాన్ని సూచిస్తుంది. అంతరాత్మకు తప్పొప్పులు తెలుస్తాయి. సత్యాన్ని గ్రహించి నిరంతరం మనకు సంకేతాలను ఇస్తుంది. అంతరాత్మ లోతుల్లోకి వెళ్తే ఎన్నో గొప్ప బహుమతులు లభిస్తాయి, కానీ అది చెప్పేది మనం  వినము.

నేను నా అంతరాత్మ మాట విని ఉంటే బాగుండేది, ఇది సరైనది కాదని ఏదో నాకు చెబుతుంది, లేదా ఈ సంబంధం అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అని మీరు ఎప్పుడైనా అనే ఉంటారు. మీకు ఎప్పటికప్పుడు సంకేతాలు ఇచ్చే అంతరాత్మ యొక్క అనుభూతి మీకు కలుగుతుందా? మనం ప్రతిరోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాము, కొన్నిసార్లు తప్పొప్పులు, నిజానిజాలను పరిశీలించలేము. మన అంతరాత్మ లేదా వివేకం మనకు అవసరమైన అన్ని సమాధానాలను కలిగి ఉంటుంది. కాబట్టి మనం దాని మాట వినవలసి ఉంటుంది. కానీ మనం సమాజంలో ఉన్న నమ్మకాలు, వ్యక్తుల అభిప్రాయాలు లేదా తెలిసిన సమాచారం ఆధారంగా విషయాలను పరిశీలిస్తాము. మన అంతరాత్మ లేదా అంతర్ బుద్ధి  అని అంటున్న మన వివేకానికి మనకు ఏది సరైనదో ఎల్లప్పుడూ తెలుసు. ఇది నిరంతరం మనల్ని సరైన దిశలో నడిపిస్తుంది. మనం చేయవలసిందల్లా దాని మాట వినడం నేర్చుకోవడమే. మనం రోజూ కొన్ని నిమిషాలు స్వయంతో గడుపుదాం. మెడిటేషన్ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం మన మనస్సులను సైలెంట్ చేసి అంతరాత్మను సక్రియం చేస్తుంది. మీ లోపలే అన్ని సమాధానాలు ఉన్నాయి.  ప్రతి చాయిస్ మరియు నిర్ణయం తీసుకోవడానికి ఆ వివేకాన్ని ఉపయోగించండి. నేను సహజంగా గ్రహించగలను. నేను నిర్ణయం తీసుకోవాల్సిన ప్రతిసారీ నేను నా అంతరాత్మకు తలవంచుతాను. అది ఎల్లప్పుడూ నాకు సరైన సమాధానం ఇస్తుంది అని మీకు మీరే గుర్తు చేసుకోండి.

 

మీ అంతరాత్మ ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు మీ అంతరాత్మ మాటను ఎంత ఎక్కువగా వింటారో, మీ మనస్సు అంత సైలెంట్ గా ఉంటుంది. తద్వారా మీ ఆలోచనలను బాగా నియంత్రించవచ్చు. నేను నా మనస్సాక్షిని విశ్వసిస్తున్నాను. నేను దాని మాట విని ప్రతిస్పందనను పొందుతాను, ఇది నాకు మరియు ఆ సీన్ లో ఉన్న వారందరికీ మంచిది అని మీకు మీరు గుర్తు చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »