Hin

6th May 2025 Soul Sustenance Telugu

May 6, 2025

మీ బలాలు, బలహీనతలను తెలుసుకోండి

మనపై మనకు అవగాహన కలిగి ఉండటం, మనలోని బలాలు మరియు బలహీనతలు తెలిసి ఉండటం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ అవగాహన ప్రపంచంతో ఎలా కనెక్ట్ అవ్వాలో చెబుతుంది, మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నామో, మన వ్యక్తిత్వంలో ఎక్కడ మార్పు తీసుకురావాలో తెలుస్తుంది. కానీ తరచుగా, మనలోని బలాలు మరియు బలహీనతలను తెలుసుకోవడానికి మనం కష్టపడుతుంటాము. మన సన్నిహితులలోగానీ, మనకు అంతగా పరిచయం లేని వారిలోగానీ, మనకు నచ్చనివారిలోగానీ ఉన్న మంచిని లేక చెడును మాత్రం త్వరగా పసిగట్టేస్తాం.

  1. ఈ ప్రపంచం ఇతరులను త్వరగా జడ్జ్ చేసేస్తుంది, త్వరగా అంచనా వేసేస్తుంది, కానీ మనలోని బలాలు, బలహీనతలను పరిశీలించుకునే చిన్న పని మాత్రం మనం ఎంతవరకు చేస్తున్నాము? మీలోని సుగుణాలు ఏమిటో మీకు తెలుసా? అవి మీ ఉన్నతికి ఎలా ఉపయోగపడతాయో ఎప్పుడైనా మీ జీవితంలో ప్రయోగించారా?
  2. మనల్ని చూసుకోవడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించము. ఈరోజు, మనలోని ఏదైనా 5 బలాలు, బలహీనతలను చెప్పమంటే మనకు చాలా సమయం పడుతుంది, కానీ కుటుంబ సభ్యులు మరియి స్నేహితుల గురించి మాత్రం వెంటనే చెప్పేస్తాము. ఇతరుల గురించి తెలుసుకోవడము, వారు మారాలి అనుకోవడం వలన ఏమీ లాభం లేదు, అది మన చేతుల్లో లేని విషయం. మనం మార్చగల ఏకైక వ్యక్తి – స్వయం.
  3. రోజూ మీతో మీరు 5 నిమిషాలు గడపండి. మీకు అనువుగా ఉండి, సరైన శక్తిని వ్యాప్తి చేస్తూ చక్కని ఫలితాలను ఇచ్చే మీ ఆలోచనలను, ప్రవర్తనను గమనించండి. ఇవే మీ బలాలు. ఈ మీ గుణాన్ని పెంచి పోషించండి. ఇందుకు భిన్నంగా, అసౌకర్యంగా ఉండేది ఏదైనా బలహీనత అవుతుంది. దానిని అధిగమించడానికి మీరు ప్రయత్నించండి.

4. మీతో మీరు చక్కని బంధాన్ని పెంచుకోండి. మీ బలాలు, బలహీనతలను తెలుసుకోవడం ద్వారా మీరు నిత్యం ఎదుగుతూనే ఉంటారు. మీకు మీరే గుర్తు చేసుకోండి – నేనేమిటో నాకు తెలుసు. నాలోని మంచి గుణాలను సర్వదా, సర్వులతో ఉపయోగిస్తూ ఉంటాను. నాలోని బలహీనతలు నాకు తెలుసు, మార్పుకు నేను సిద్ధంగా ఉన్నాను. 

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »