Hin

24th may 2024 soul sustenance telugu

May 24, 2024

మీ భావోద్వేగ స్థితిపై ఆధిపత్యం చెలాయించడానికి ఇతరులను అనుమతించవద్దు

మన వ్యక్తిగత లేదా కార్యాలయంలో ఉన్న సంబంధాలలో, కొన్నిసార్లు మనం ఎదుటి వ్యక్తి మనపై ఆధిపత్యం చెలాయిస్తున్నారనీ, ప్రతికూలంగా కంట్రోల్ చేస్తున్నారని భావిస్తాము. ఎవరైనా మీపై కోపం తెచ్చుకుని, మిమ్మల్ని ప్రతిస్పందించేలా, కలత చెందేలా ప్రవర్తించినప్పుడు, వారు మీపై ఆధిపత్యం చెలాయించిన వారవుతారు. కొంత కాలానికి, వారు ఒక అదృశ్య, శక్తివంతమైన రిమోట్ కంట్రోల్‌ని కలిగి ఉన్నారని వారు గ్రహించడం ప్రారంభిస్తారు, దానిని ఉపయోగించి, వారు మిమ్మల్ని  కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు, వారు మీపై కోపం తెచ్చుకొని వారు కోరుకున్నది సాధిస్తారు. వారి కోపం రిమోట్ కంట్రోల్ అవుతుంది. మీరు ప్రతిస్పందిస్తే  మీరు ఈ నియంత్రణను అనుమతిస్తున్నారు లేదా అవతలి వ్యక్తి రిమోట్ కంట్రోల్‌ గా పని చేయడాన్ని  అనుమతిస్తున్నారు. మిమ్మల్ని ప్రభావితం చేయడానికి మరియు ఆధిపత్యం చెలాయించడానికి ఎంచుకునేది మీరు. మనం ఇతరులు మనల్ని కంట్రోల్ చేసేలా లేదా ఎదుటివారి ప్రతిచర్యకు గురికాకుండా, మన ప్రేమ, శుభ భావనలు, గౌరవాన్ని కాపాడుకుంటూ మన భావాలను వ్యక్తీకరించడాన్ని ఎంచుకోవచ్చని గ్రహించడం చాలా ముఖ్యం.

వస్తువులు, వ్యక్తులతో సహా మనకు బాహ్యంగా ఉన్న అస్తిత్వాల ద్వారా మనపై ఆధిపత్యం చెలాయించడానికి, ప్రభావితం చేయడానికి అనుమతిస్తే మన ఆధ్యాత్మిక శక్తిని కోల్పోతాము. ప్రతి క్షణం మనం మరొక వ్యక్తి యొక్క రిమోట్ కంట్రోల్ విజయవంతంగా పని చేయడానికి అనుమతిస్తూ ఉంటే లేదా మన భావోద్వేగ స్థితిని నియంత్రించడానికి, ఆధిపత్యం చేయడానికి ఒక వస్తువును అనుమతిస్తూ ఉంటే, మనం  అంతర్గతంగా బలహీనపడతాము. ఎదుటివారి చేతిలో కీలుబొమ్మలా తయారవుతాం. తోలుబొమ్మ ఎప్పుడూ శక్తివంతం కాదు ఎందుకంటే అది తనంతట తానుగా పని చేయదు, వేరొకరిచే నియంత్రించబడుతుంది. మన శక్తిని కాపాడుకోవాలన్నా, ఆధ్యాత్మికంగా శక్తివంతంగా ఉండాలంటే మనం దానిని నిరోధించాలి. ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం రెండూ మన ఆధ్యాత్మిక శక్తులను పెంచుతాయి. కొంత కాలానికి మన ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతాయి. ఈ రెండూ మనకు స్వస్థితిలో ఉండటానికి సహాయపడతాయి. మరొకరి రిమోట్ కంట్రోల్‌ని పని చేయడానికి అనుమతించకుండా ఉండటమే కాకుండా మనకు సరైనవి అనిపించే విషయాలలో  దృఢంగా ఉండాలి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »