Hin

12th sep 2024 soul sustenance telugu

September 12, 2024

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

  1. ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత, మనం దానిని రోజులో చాలాసార్లు రివైజ్ చేసుకుంటాము. మన మనస్సు దానిని మళ్లీ మళ్లీ వింటుంది. అప్పుడు మనం జీవితంలోని ప్రతి పరిస్థితిలో జ్ఞానం యొక్క ప్రతి అంశాన్ని ధారణ చేసి జ్ఞానసాగరుడైన భగవంతుని సంతానం, మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతాము.
  2. భగవంతుని మాటలను తలచుకుంటూ, విజువలైజ్ చేసుకుంటూ ధ్యానం చేయండి – మీరు వినే ప్రతి భగవంతుని వాక్యాన్ని లోతుగా ఆలోచించి, దానిని మీ మనసులో ఒక చిత్రంగా చూస్తూ దానికొక అందమైన రూపాన్ని ఇవ్వండి. భగవంతుడు పరమ శిక్షకుడు. వారు పంచుకునే జ్ఞానం చాలా విలువైనది మరియు రహస్యాలతో నిండి ఉంటుంది. భగవంతుని జ్ఞానాన్ని మీ స్వంత వ్యక్తిగత నిధిగా మార్చడానికి ధ్యానం అత్యంత అందమైన మార్గం.
  3. ప్రతి అడుగులో సానుకూలత మరియు స్వచ్ఛతలో భగవంతుడిని అనుసరించండి – మన సానుకూల మనస్సు, స్వచ్ఛమైన బుద్ధితో భగవంతుని జ్ఞానం మనలో పెరుగుతుంది. మన ఆలోచనలు, భావాలు, వైఖరులు, దృష్టి, మాటలు మరియు చర్యలు ఆ అందమైన స్మృతి యొక్క ప్రతిబింబం. అప్పుడు మనం జీవితంలోని ప్రతి పరిస్థితిని, సంబంధాన్ని జ్ఞాన నేత్రాలతో చూడటం ప్రారంభిస్తాము.
  4. జ్ఞానం యొక్క ప్రతి ముత్యాన్ని ఇతరులతో పంచుకోండి – మన కుటుంబ సభ్యులకు, మన స్నేహితులకు మరియు మన కార్యాలయ సహచరులకు మనం ఇవ్వగలిగే ఉత్తమ బహుమతి భగవంతుని జ్ఞానం మరియు దానిని మనలో మనం అనుభవం చేసుకోవటం. నేడు, దాదాపు ప్రతి ఆత్మ ఒత్తిడితో, బాధలో ఉంది. శాంతి మరియు ఆనందానికి జ్ఞానం ముఖ్యం. ఇది ఆత్మకు ప్రకాశం. అందరూ వారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని చెక్ చేసుకొని మార్చుకోవడానికి సహాయపడుతుంది.
  5. రోజు చివరిలో మీ పురోగతిని చెక్ చేసుకొని నిర్ణయించుకోండి – పనులతో రోజంతా గడిచాక, ఆ రోజును మంచిగా ముగించడం అంటే జ్ఞానం అనే అద్దంలో ఏవైనా తప్పులు ఉన్నాయా అని ఆ రోజులోని పురోగతిని చెక్ చూసుకోవటం. వివేకం లేని ఆలోచనలు, మాటలు మరియు చర్యలు తప్పులు. మీకు మీరు నిర్ణయించుకున్న తర్వాత, మరుసటి రోజుకు మీ తప్పులను సరిదిద్దుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »