Hin

30th july 2024 soul sustenance telugu 2

July 30, 2024

మీ జీవితంలోని సందర్శనా స్థలాలను ఆస్వాదించండి (పార్ట్ 1)

జీవితంలో, మనం వివిధ రకాల పరిస్థితులను అనుభవిస్తాము, కొన్ని మంచివి మరియు కొన్ని కఠినమైనవి. మన జీవితంలో, మన మార్గంలో వచ్చే పరిస్థితులు, అనుభవాలలో సదా మార్పు వస్తూనే ఉంటుంది. ఈ జీవిత ప్రయాణంలో, మనకు ఒక ఎంపిక ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. కష్టమైన పరిస్థితులను నిర్వహించడానికి భయం లేదా ప్రేమ యొక్క ఆంతరిక మానసిక స్థితిలో ఉండటాన్ని మనం ఎంచుకోవచ్చు. ప్రేమతో ఒక నిర్దిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం అంటే మనం కరుణను మన ప్రతిస్పందన భావోద్వేగంగా ఎంచుకుంటున్నాము. అలాగే, ఇది తాత్కాలిక పరిస్థితి అనే వాస్తవం మనకు తెలుసు మరియు పరిస్థితి మనల్ని నిర్వచించడానికి, మన భావోద్వేగాలను ప్రతికూలంగా ప్రభావితం చేయడానికి అనుమతించము. అనేక విధాలుగా, జీవితంలో కష్ట సమయాలను ఎదుర్కొనే విధానాన్ని పర్యాటకుడిగా సందర్శనా అనుభవంతో పోల్చవచ్చు, అతను కొంతకాలం మాత్రమే జీవిత అనుభవాలను సేకరించి, ఆపై ఇంటికి బయలుదేరతాడు. ఈ సందేశం ద్వారా ఈ పోలికను పరిశీలిద్దాం:

 

  1. ప్రయాణించేటప్పుడు, మనం తరచుగా మన టూర్ గైడ్ ను మన కోసం ప్రయాణ ప్రణాళికను రూపొందించడానికి మరియు ఏమి చూడాలో లేదా ఒకే చోట ఎంత సమయం గడపాలో నిర్ణయించడానికి అనుమతిస్తాము. మనం అలా చేస్తాము, ఎందుకంటే వేరొకరు ప్రణాళిక నిర్ణయాలు తీసుకోగలరు, ఫలితంగా, మనకు విషయాలను సులభతరం చేసి, కూర్చుని మన ప్రయాణాన్ని ఆస్వాదించేలా చేస్తారు. అదేవిధంగా జీవితంలో, జీవితం మనకు ఏది ఇచ్చినా, మనం దానిని అంగీకరించి, విజయానికి ఒక మంచి అవకాశంగా మార్చగలిగే విధంగా మనకు మనం శిక్షణను ఇచ్చుకోవాలి. జీవితంలో ఏ పరిస్థితి పరిష్కరించలేనిది కాదని, అది నిరంతరం అభివృద్ధి చెందుతోందని మనం గుర్తుంచుకోవాలి. ఒక పర్యాటక స్థానంలో ప్రయాణికుడిలాగే, మన ఆలోచనలు, మాటలు మరియు చర్యలలో మన చిన్న చిన్న ఎంపికలను చేసుకోవచ్చు. ప్రతి ఎంపికకు ఒక ఫలితం ఉంటుంది, దానిని మనం ఆనందంగా అంగీకరించడం నేర్చుకోవాలి.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

6th dec 2024 soul sustenance telugu

అందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రపంచాన్ని సృష్టించుకుందాం

వివిధ దేశాల నుండి వచ్చిన, వివిధ భాషలు మాట్లాడే, వివిధ మతాలను అనుసరించే, జీవితంలోని వివిధ రంగాలలో వివిధ రకాల చర్యలను నిర్వహించే కోట్లమంది మానవులతో నిండిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. భగవంతుడు మన

Read More »
5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »