Hin

30th july 2024 soul sustenance telugu

July 31, 2024

మీ జీవితంలోని సందర్శనా స్థలాలను ఆస్వాదించండి (పార్ట్ 2)

  1. పర్యటనలో అందరినీ కలవడానికి మనం తరచుగా మన మార్గాల నుండి బయటకు వస్తాము. మనం ఈ వ్యక్తులతో కొత్త దృశ్యాలను చూడటానికి, కొత్త విషయాలను అనుభవం చేసుకోవడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాము. అదేవిధంగా, జీవితంలో, మనం కలిసే ప్రతి ఒక్కరూ మనకు ఏదో నేర్పించడానికి ఇక్కడ ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా, మనల్ని బాధపెట్టే వ్యక్తిని మన మీద మనం పనిచేసుకోవడం నేర్పించే వ్యక్తిగా మనం చూడవచ్చు. ఈ ఆలోచనా విధానం మన జీవితంలోని వివిధ సంఘటనలను గ్రహించే మరియు ప్రతిస్పందించే విధానాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. నేర్చుకున్న పాఠాలకు ప్రాముఖ్యత ఇవ్వడం సానుకూల మార్పుకు కీలకం, ఇది ఒత్తిడిలో కుంచించుకుపోయే బదులు మనకు సాధికారత అనుభూతిని కలిగిస్తుంది.
  2. పర్యాటకులుగా మారడం అనేది ప్రయాణంలో కొంత భయాన్ని తొలగించడానికి మనకు సహాయపడుతుంది. మనం ప్రతి దృశ్యాన్ని ఆస్వాదిస్తాము, అది మనకంటే ఉన్నతంగా లేదా నీచంగా కావచ్చు, ఎందుకంటే అది పర్యాటకులుగా మనకు అందుబాటులో ఉందని, మన ఇళ్లలో ఈ రకమైన అనుభవాన్ని సృష్టించలేమని మనం నమ్ముతాము. అదేవిధంగా, పరిస్థితులు సవాలుగా ఉండవచ్చు, కానీ వాటిని మన జీవిత ప్రయాణంలో ప్రత్యేకమైన అవకాశాలుగా చూస్తూ, ఆధ్యాత్మిక వృద్ధిని తీసుకువస్తే, అవి ఇకపై సమస్యలు కానే కావు. మనం ప్రయాణంలో చేసినట్లుగా, సుపరిచితమైన మరియు సురక్షితమైన ప్రదేశాల నుండి బయటికి వచ్చి, తెలియని విషయాలను అనుభవం చేసుకున్నట్లుగా, మనం సర్దుకొని మన కంఫర్ట్ జోన్ల (అనువైన ప్రదేశాలు)ను వదిలి వెళ్ళే ధైర్యం నుండి నిజమైన బలం ఉద్భవిస్తుంది.

(సశేషం…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »