Hin

13th feb 2024 soul sustenance telugu

February 13, 2024

మీ జీవితంలో ఉన్న వివిధ వడపోతలను పరిశీలించుకోండి

భౌతిక స్థాయిలో రకరకాల రంగులతో, వివిధ రకాల వడపోతలు ఉన్నట్లుగా ఆధ్యాత్మిక స్థాయిలో, అనేక వడపోతలు (ఫిల్టర్లు) మన జీవితంలో పని చేస్తూ ఉంటాయి అనగా, అసూయ వడపోత, ద్వేషం వడపోత, మోహం వడపోత, భయం వడపోత, అత్యాశ వడపోత మొదలైనవి. ఇలాంటివి మరెన్నో. ఈ ఫిల్టర్ల కారణంగా, మనం వ్యక్తులను, పరిస్థితులను అవి ఎలా ఉన్నాయో అలా చూడము, మనం ఎలా ఉన్నామో అలా చూస్తాము ఎందుకంటే ఆ ఫిల్టర్లు మనం తయారు చేసుకున్నవి కాబట్టి. వ్యక్తులను, పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటే మన జీవితంలో ఎక్కువగా ఏ వడపోతలు పని చేస్తున్నాయో పరిశీలించుకోవాలి. మనందరిలో రకరకాల ఫిల్టర్లు వివిధ స్థాయిలలో పని చేస్తుంటాయి, ఇది మన వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఉదా- ఒక వ్యక్తిలో భయం అనే వడపోతకన్నా అసూయ అనే వడపోత ఎక్కువగా పని చేస్తుండవచ్చు.

ఈ ఫిల్టర్ల కారణంగా, మనం చూసేదంతా ఆ సమయంలో మనం ఉపయోగించే ఫిల్టర్ కారణంగా రంగు వేయబడ్డ వాస్తవం, ఏమి చూడాలో, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో, దేనికి ఎక్కువ ప్రభావితమవ్వాలో, ఫిల్టర్ నుండి ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు మొదలైన అంశాలను బట్టి మన దృష్టికోణం పక్షపాత వైఖరిలో ఉంటుంది. మన మనసులలో, వ్యక్తుల గురించి మరియు పరిస్థితుల గురించి ఒక అవాస్తవ అభిప్రాయాన్ని ఇప్పటికే ఈ ఫిల్టర్ల కారణంగా తయారు చేసుకుని ఉన్నాము. ఎంత ఎక్కువ సమయం ఈ అవాస్తవ అభిప్రాయం కొనసాగుతుందో అంత కాలం ప్రపంచం ఇంతే అన్న ధోరణి మనలో ఉంటుంది. మనలోని ఫిల్టర్లు, లభిస్తున్న వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తుంటాయి. ఈ అవాస్తవ దృశ్యాన్ని పదే పదే ధృవీకరిస్తూ ఉన్న కారణంగా మన మనసులో ఉన్న అవాస్తవ అభిప్రాయం కూడా బలపడుతూ జీవిత ప్రయాణంలో ఆ దిశలోనే నడిపిస్తాయి. వాస్తవాన్ని చూసే స్థిర మార్గాన్ని నమ్మకం అంటాం. అంటే, ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం లేదు, మన మనసులో ఏర్పరుచుకున్న ప్రపంచాన్నే మనం చూస్తున్నాం. ఒక రకంగా, ఆధ్యాత్మక స్థాయిలో చెప్పాలంటే, వాస్తవాలను గుర్తించలేని గుడ్డివారిగా, చెవిటివారిగా అయ్యామనే చెప్పవచ్చు. ఈ అంధత్వాన్ని, చెవిటితనాన్ని నయం చేసుకోవాలంటే  ఉన్న ఫిల్టర్లను ఒక దాని తర్వాత ఒకటి తొలగించాల్సిన అవసరం లేదు, ఇది చాలా పెద్ద పని అవుతుంది. ఇందుకు ఒక పవిత్రమైన, వాస్తవ అంతరాత్మతో ప్రారంభించి ఎటువంటి ఫిల్టర్లు లేకుండా చూడటం ప్రారంభిస్తే సరిపోతుంది. ఫలితంగా, నిదానంగా మనలో ఉన్న అవాస్తవ నమ్మకాలు కరిగిపోయి, వడపోతలు లేని స్వచ్ఛమైన దృష్టికోణంతో మనలో సరైన నమ్మకాలు మొదలవుతాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th feb 2025 soul sustenance telugu

భగవంతుడు సర్వోన్నతుడైన తండ్రి మరియు తల్లి

ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మత సంప్రదాయాలలో, భగవంతుడిని ఎల్లప్పుడూ పురుషుడిగా సూచిస్తారు. కానీ, ఆత్మకు లింగం లేదు, అది పురుష లేదా స్త్రీలింగం కాదు. అలాగే భగవంతుడిని అనగా పరమ ఆత్మ యొక్క లింగం

Read More »
17th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 3)

ప్రతి సంబంధంలో ఆ సంబంధం ఎలా ఉన్నా కూడా ఎదుటి వారిని ముందు ఉంచే వ్యక్తి సంబంధాన్ని నడిపిస్తాడని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తిని ముందు ఉంచడం అంటే కొన్ని సమయాల్లో మీరు ఒక నిర్దిష్ట

Read More »
16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »