Hin

2nd-nov-2023-soul-sustenance-telugu

November 2, 2023

మీ జీవితంలోని ప్రతి క్షణంలో ఆనందానికి  5 మార్గాలు

మీ గుణాలను పెంచుకొని వాటిని ఇతరులతో పంచుకోండి – ప్రతి క్షణం ఆనందాన్ని అనుభూతి చెందడానికి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని మీ మంచి గుణాలను మరియు మీ బలహీనతలను కూడా చెక్ చేసుకోండి. మీ మంచి గుణాలను మెరుగుపరచుకుంటూ వాటితో ఇతరులకు ఆనందాన్ని ఇవ్వండి మరియు మీ బలహీనతలను మార్చుకుంటూ వాటి ద్వారా  ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వకుండా చూసుకోండి. ఇలా చేయడం వల్ల అందరి దీవెనలు పొంది సుఖ సంతోషాలతో ఉంటారు.

ప్రతి ఉదయం మీ కోసం సమయాన్ని కేటాయించండి – చాలా మంది వ్యక్తులు ఉదయాన్నే వార్తాపత్రిక చదవడం, మొబైల్‌లను చెక్  చేయడం లేదా టెలివిజన్ చూడటంతో వారి రోజును మొదలుపెడతారు. ఇది మన ఆధ్యాత్మిక సంపదను హరించివేసి మనల్ని ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా బలహీనపరచి మన సంతోషాన్ని తగ్గిస్తుంది. దానికి బదులుగా మనం ఉదయం కనీసం 30 నిమిషాల సమయం మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కేటాయించాలి. ఇది మనకు సంతృప్తిని కలిగించడంతో రోజంతా సంతోషంగా ఉంటాము.

రోజంతా ఒక వివేకవంతమైన పాయింట్ ను గుర్తుంచుకోండి – ప్రతిరోజూ మీ స్పృహలో ఒక జ్ఞానం యొక్క పాయింట్ ను గుర్తుంచుకొని,  దానితో మూడు పనులు చేయండి – దాని గురించి లోతుగా ఆలోచించి దాని అర్థాన్ని చక్కగా అర్థం చేసుకోండి, ప్రతి ఆలోచన, మాట మరియు చర్యలో దానిని ఆచరణలో పెట్టండి. మీరు కలిసే ప్రతి ఒక్కరితో పంచుకోండి. ఇది మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా మరియు తేలికగా ఉంచుతుంది.

మీతో మీరు మాట్లాడుకుంటూ చింతకు దూరంగా ఉండండి – రోజంతా సంతోషంగా ఉండటానికి ఒక మంచి మార్గం అన్ని భారాల నుండి విముక్తి పొందడం మరియు మీ జీవిత సమస్యలన్నింటినీ భగవంతునికి అప్పగించడం. మీరు ఎంత ఎక్కువగా అప్పగిస్తే భగవంతుడు మిమ్మల్ని ప్రతి పరిస్థితిలో అంతగా రక్షిస్తాడు. మీ జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని కోల్పోరు. రోజులో ఎప్పటికప్పుడు భగవంతుడితో హృదయపూర్వకంగా సంభాషించడం ద్వారా భగవంతుడిని సన్నిహితంగా అనుభూతి చేసుకోవడంలో సహాయపడుతుంది.

ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తూ వారి గురించి అందరితో మంచిగా మాట్లాడండి – తేలికగా మరియు స్థిరమైన ఆనందాన్ని అనుభూతి చెందడానికి, ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా గౌరవిస్తూ వారి గురించి మంచి భావాలను  మరియు మంచి మాటలను ప్రసరింపజేయండి. అలా చేయడం ద్వారా వారి గుణాలు మీ ప్రత్యేకతలుగా మారుతాయి, మీరు నిండుగా, సంతోషంగా ఉంటూ ప్రతి క్షణం చిరునవ్వులు చిందిస్తారు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 6)

బ్రహ్మా కుమారీలకు  కొత్తగా వచ్చినవారు అడిగే ఒక సాధారణ ప్రశ్న ఏమిటంటే, మనం కేవలం ధ్యానం మాత్రమే ఎందుకని నేర్చుకోలేము? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివరించే 7 రోజుల కోర్సు యొక్క వివిధ సెషన్లకు మనం

Read More »
17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »