Hin

1st august 2024 soul sustenance telugu

August 1, 2024

మీ జీవితంలోని సందర్శనా స్థలాలను ఆస్వాదించండి (పార్ట్ 3)

  1. ప్రయాణం ద్వారా మనం నేర్చుకునే మరో గుణం సహనం. ప్రయాణం వేచి ఉండటం, విశ్రాంతి తీసుకోవడం సరైందే అని ఇది మనకు బోధిస్తుంది, ఏదైనా పని జరగనప్పుడు ఓపికగా ఉండటం నేర్చుకొని, ఇతరుల నుండి మరియు భగవంతుని నుండి సహాయం తీసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. జీవిత పరిస్థితులలో కూడా, మనం సహనాన్ని ఉపయోగిస్తూ ప్రతి విభిన్న అనుభవాన్ని అలసిపోకుండా, అసహనానికి గురికాకుండా మరింత ఎక్కువగా అభినందించడం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కష్టమైన పరిస్థితి ఏదో ఒక సమయంలో ముగుస్తుంది.
    5. మనం సందర్శనా స్థలాలను సందర్శించేటప్పుడు తేలికగా ప్రయాణిస్తాము. మనం ఇంటికి వచ్చి, మనుగడ సాగించడానికి అవసరమైనవి మాత్రమే అవసరం అని గ్రహిస్తాము. జీవితంలో కూడా, మనం చాలా తక్కువతో జీవించగలం. అలాగే, ప్రయాణీకులుగా మనం కూడగట్టుకునే అందమైన బహుమతి, చుట్టూ ఉన్న వ్యక్తులతో, జీవితంలోని వివిధ రంగాలకు చెందిన వారితో స్నేహం చేసినప్పుడు, అందరిలో ఒక విషయం కామన్ గా ఉంటుంది. అది సాహసం మరియు కొత్త అనుభవాల పట్ల ప్రేమ. అదేవిధంగా జీవితంలో కూడా, మనల్ని మనం ప్రేమ మరియు స్నేహంతో చుట్టు ముడ్తూ ఉండేలా, ఇక్కడ మనం ఇతరుల విభేదాలను అభినందిస్తాము మరియు సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేసిన గత పరిస్థితులను వదిలివేస్తాము.
    ధ్యానం అనేది ఒక అందమైన పద్ధతి. ఇది మీకు మరియు మీ మనస్సుకు మధ్య కొంత ఖాళీని సృష్టించడానికి, మీరు మీ స్వంత ఆలోచనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, ఒక ఆధ్యాత్మిక జీవిగా మనకు ఏది సరైనది మరియు ఏది కాదు అని ఒకసారి తెలుసుకుంటే, మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి మన నుండి వేరని, దానిని సానుకూలంగా ప్రభావితం చేయగలమని చాలా స్పష్టంగా అర్ధం చేసుకోవడంలో ఇది మనకు సహాయపడుతుంది. ఆలోచనలో ఈ స్పష్టత యొక్క సాధికారత పొందిన తరువాత, మనం చాలా నిర్లిప్తత, ఆధ్యాత్మిక బుద్ధి మరియు భావోద్వేగ సామర్థ్యంతో పరిస్థితులను ఎదుర్కోవచ్చు. అపుడు పరిస్థితులు మనల్ని ముంచెత్తవు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

14th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 1)

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
13th sep 2024 soul sustenance telugu

ఇతరుల స్క్రిప్ట్ను రాసే  ప్రతికూల అలవాటు

జీవిత నాటకంలో మనమందరం నటులం, అనేక పాత్రలను పోషిస్తున్నాము. ప్రతి సన్నివేశం మన స్వంత స్క్రిప్ట్ను వ్రాసుకొని నటించాలని కోరుతుంది. కానీ, తరచూ మనం మన స్క్రిప్ట్లకు సమయాన్ని వెచ్చించము. బదులుగా మనం మనసులో

Read More »
12th sep 2024 soul sustenance telugu

మీ జీవితంలో భగవంతుని  జ్ఞానాన్ని తీసుకురావడానికి 5 మార్గాలు

ప్రతిరోజూ మీ మనస్సులో భగవంతుని జ్ఞానంపై దృష్టి పెట్టండి – ప్రతిరోజూ భగవంతుడు మనతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకుంటారు. దానిని చదివి మనం మన డైరీలు మరియు హృదయాలలో నోట్ చేసుకుంటాము. వ్రాసుకున్న తరువాత,

Read More »