Hin

6th july 2024 soul sustenance telugu

July 6, 2024

మీ జీవిత వృక్షపు కొమ్మలపై మోహం పెంచుకోకండి

మనలో చాలా సాధారణమైన అలవాటు స్వంతం చేసుకునే అలవాటు. ఇది మనలో లోతుగా పాతుకుపోయింది. దీనికి పదేపదే లొంగిపోతూ ఉంటాము. మనం బాహ్య స్థాయిలో వివిధ వ్యక్తులు, భౌతిక సుఖాలు, పాత్రలు, స్థానాలు, అనుభవాలు, విజయాలు మరియు మన భౌతిక శరీరం మొదలైన వాటితో సంబంధం కలిగి ఉంటాము. అలాగే అంతర్గత స్థాయిలో మన స్వంత ఆలోచనలు, దృక్కోణాలు, నమ్మకాలు, జ్ఞాపకాలు మొదలైన వాటితో సంబంధం కలిగి ఉంటాము. ఇవన్నీ మన జీవిత వృక్షాన్ని తయారు చేసే కొమ్మలు లాంటివి. స్వంతం చేసుకోవడం అనేది మన జీవిత ప్రయాణంలో మనం ఒక శాఖ నుండి మరొక శాఖకు మారుతున్నప్పుడు, ఎప్పటికప్పుడు ఈ విభిన్న శాఖలలో ఏదో ఒకదాన్ని పట్టుకొని ఉండడం.  కానీ ఈ అలవాటు పై ఆధ్యాత్మిక దృక్పథం స్పష్టంగా, సూటిగా – “దేనినీ సొంతం చేసుకోవడం సాధ్యం కాదు” అని చెప్తుంది. మనం అలా చేయడానికి ప్రయత్నిస్తే, మనం మన స్వేచ్ఛను కోల్పోతాము. స్వేచ్ఛ కోసం మనం కొమ్మలను విడిచిపెట్టడానికి ధైర్యం చేయాలి.  విడిచిపెట్టడం అంటే వాటిని కోల్పోవడం లేదా వదిలివేయడం కాదు ఎందుకంటే కొమ్మలు ఎల్లప్పుడూ ఉంటాయి. మనం కోరుకున్నప్పుడల్లా విశ్రాంతి లేదా విరామం తీసుకోవ డానికి వాటిలో దేని దగ్గరకైనా తిరిగి వెళ్ళవచ్చు. కానీ, అవగాహన మరియు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, ఒక కొమ్మపై విరామం అని అనుకోని ఆగిపోయిన క్షణం, అదే విరామం అడ్డంకిగా మారుతుంది. ఆ అడ్డంకి అవరోధంగా మారుతుంది. ఫలితంగా, భౌతిక స్థాయిలో ఒక పక్షి ఇలానే చేసినప్పుడు, ఎలాగైతే దాని ఎగిరే శక్తి తగ్గుతుందో, మన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ శక్తి తగ్గడం ప్రారంభిస్తుంది.

మనం ఒక్కొక్క సారి ఒక్కొక్క శాఖను విడిచిపెట్టడం నేర్చుకున్నప్పుడు, మన జీవితంలో కొత్త సానుకూల, సాధికారిక అనుభవాలను ఎల్లప్పుడూ స్వాగతిస్తాము. పక్షుల మాదిరిగానే, ఒక కొమ్మను విడిచిపెట్టడం ద్వారా,  జీవితపు అనేక ఇతర కొమ్మలను కనుగొనడానికి ప్రయత్నిస్తూ గడపగలుగుతాము. తద్వారా ప్రతి కొత్త స్థానం నుండి ఆ దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు. ఎత్తుకు ఎగిరే జీవితమా లేదా ఇతరులు ఎగిరేది చూస్తూ ఏదో ఒక కొమ్మపై ఇరుక్కుపోయి ఉండటమా అని మనం ఎంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు మన జీవిత వృక్షాన్ని సందర్శిస్తూ, దానిని లేదా దాని కొమ్మలను స్వంతం చేసుకొనే ప్రయత్నం చెయ్యకుండా మనం స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఆస్వాదించటమే ఉత్తమం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

12th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 2)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 శ్రీ సీతారాములు మరియు శ్రీ లక్ష్మణుడు 14 సంవత్సరాల వనవాసంలో ఉండగా,  ఒక రోజు శ్రీ సీత తన ఆశ్రమానికి సమీపంలో వెండి చుక్కలతో ఉన్న అందమైన

Read More »
11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »