Hin

4th feb 2025 soul sustenance telugu

February 4, 2025

మీ కార్యాలయ వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోవడానికి 5 మార్గాలు

 

  1. ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన సానుకూల ఆలోచనలను ప్రతిరోజూ పంచుకోవడం, చదవడం – మీ కార్యాలయంలో చేయగలిగే చాలా మంచి అభ్యాసం ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానంతో ఒకరినొకరు సానుకూల మరియు స్వచ్ఛమైన ఆలోచనతో ట్యూన్ చేయడం. దీనిని ప్రతి ఉదయం ఇంటర్నెట్, సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరితో పంచుకోవచ్చు లేదా ప్రతి ఒక్కరూ వాటిని చదవగలిగేలా కార్యాలయంలో నోటీసు బోర్డులపై ప్రదర్శించవచ్చు. అదే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిరోజూ చదవడం ద్వారా అదే ఆలోచనా విధానాలు కార్యాలయంలో ఆధ్యాత్మిక సామరస్యాన్ని సృష్టిస్తూ కార్యాలయ వాతావరణాన్ని అందంగా మరియు మంచితనంతో నిండిన వైబ్రేషన్లతో నింపుతాయి. 

 

  1. ఆధ్యాత్మిక ఛార్జింగ్ కోసం కార్యాలయంలో ధ్యాన గదిని ఏర్పాటు చేసుకోవటం – కార్యాలయాలలో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ధ్యానం కోసం ఒక చిన్న అంకితమైన స్థలం ఉంటుంది, ఇక్కడ కార్యాలయంలోని వారు ఎవరైనా వెళ్లి కొన్ని నిమిషాలు కూర్చుని ధ్యానం యొక్క లోతైన అనుభవాన్ని పొందవచ్చు మరియు ఆధ్యాత్మిక శక్తితో తమను తాము చార్జ్ చేసుకోవచ్చు. అలాగే, కార్యాలయంలోని వ్యక్తులు తమ డెస్క్ ల ముందు కూర్చున్నప్పుడు ప్రతి గంటకు ఒక నిమిషం పాటు ఆలోచనల యొక్క మైండ్ ట్రాఫిక్ నియంత్రణను అభ్యసించవచ్చు. 
  2. స్వచ్ఛమైన మరియు సానుకూల శక్తితో నిండిన సానుకూల సంభాషణలు – ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి ఏమనుకుంటున్నారో, మాట్లాడుతున్నారో అనేది ఆఫీస్ యొక్క వైబ్రేషన్లను తెలిపే మరియు ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన దశ. ఆఫీస్ లో వేర్వేరు వ్యక్తిత్వాలు మరియు పని విధానాలతో చాలా మంది వ్యక్తులు ఉన్నందున, వ్యక్తులు కార్యాలయంలో ఒకరికి లేదా చాలా మంది వ్యక్తులకి ఒకరినొకరి గురించి ప్రతికూలంగా, అనవసరంగా వ్యాఖ్యానిస్తారు. దీన్ని నివారించి, పనిలేని కబుర్లు వదిలేయడాన్ని కార్యాలయం యొక్క విజయవంతమైన మంత్రంగా మారిస్తే కార్యాలయంలో ఆధ్యాత్మిక శక్తి పునరుజ్జీవితమవుతుంది. 

 

  1. కార్యాలయంలో ప్రేమ, వినయం మరియు సహకారం యొక్క శక్తి ఉండేలా చూసుకోవడం – కార్యాలయం యొక్క సానుకూల వాతావరణాన్ని తగ్గించి, ఒత్తిడిని కలిగించే అత్యంత ముఖ్యమైన కారకాల్లో అసూయ, ద్వేషం, పోల్చటం మరియు అతి పోటీతత్వం ఒకటి. మనం ఎల్లప్పుడూ ఇతరులకన్నా ముందుకు వెళ్లి ఇతరులకన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించినప్పుడు, మనలో ఒకరి పట్ల మరొకరికి సానుకూల వైబ్రేషన్లు ఆగిపోతాయి. మనం ప్రేమపూర్వకంగా,  వినయంగా ఉన్నప్పుడు మరియు ఈ మధురమైన స్మృతిలో ఇతరులను మన కంటే ముందు ఉంచినప్పుడు, మనం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాము.

 

  1. శాంతి మరియు హాయిగా అనిపించే సానుకూల భౌతిక చర్యలు తీసుకోవడం – ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యాలయాలలో పాటిస్తున్న ఒక అందమైన పద్ధతి ఏమిటంటే, కార్యాలయంలో నేపథ్యంలో మృదువైన మరియు ప్రశాంతమైన ధ్యాన సంగీతాన్ని మ్రోగించడం. అలాగే, కార్యాలయంలో ప్రతి ఒక్కరికీ శాంతి అనుభవాన్ని అందించే విధంగా కార్యాలయం ఇంటీరియర్స్ ను తయారు చేయండి. ఆహ్లాదకరమైన తేలికపాటి వాతావరణాన్ని సృష్టించే గోడలు, ఫర్నిచర్ మరియు పార్టీషన్ల కోసం తేలికపాటి ఆధ్యాత్మిక రంగులు మరియు డిజైన్లను ఎంచుకోవడం ముఖ్యమైన భౌతిక దశలు.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »