Hin

27th-oct-2023-soul-sustenance-telugu

October 27, 2023

మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని ఎదుర్కునే శక్తిని మరియు సమర్థతను పరీక్షిస్తాయి ఎందుకంటే జీవితంలో అనిశ్చితులు అపారంగా వస్తుంటాయి, జీవితంలో సవాళ్లను ఎప్పుడూ అధిగమిస్తూనే ఉండాలి. మన ప్రస్తుత జీవితంలో వచ్చే ప్రతికూల పరిస్థితి అనేది గత జీవితంలో లేదా ఈ జీవితంలో చేసిన తప్పు కర్మ లేదా కర్మలకు సంకేతం. అలాగే, ప్రస్తుత సమయంలో చేసే మంచి కర్మలు గతంలో చేసిన ఈ ప్రతికూల కర్మల ప్రభావాన్ని రద్దు చేసి అవి కలిగించే దుఃఖం లేదా అసంతృప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కర్మలు, చెడు కర్మలు అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ సందేశంలో వీటి అర్థాన్ని తెలుసుకుందాం.

  1. ఆత్మ యొక్క స్వధర్మాలైన శాంతి, సంతోషం, పరమానందం, పవిత్రత, శక్తి మరియు జ్ఞానముల ఆధారంగా చేసే కర్మలను సత్కర్మలు అని అంటాము. ఇందుకు భిన్నంగా, ఈ గుణాల నుండి మన వ్యక్తిత్వాన్ని మరియు సంస్కారాలను దూరంగా తీసుకువెళ్ళే కర్మలను చెడు కర్మలు అని అంటాం. ఉదాహరణకు, ఈరోజు నా సహోద్యోగుడు నాతో చాలా కోపంగా ఉన్న కారణంగా నేను కూడా నా శాంతాన్ని కోల్పోయాను. అతనిపై కోప్పడ్డ తర్వాత నాకెలా అనిపిస్తుంది? శాంతి, ప్రేమ మరియు ఆనందం లోపించినట్లుగా, నా కోపం తెలివిహీనమైనదిగా అనిపిస్తుంది. ఈరోజు నేను గర్వంతో వ్యవహరించి నా మాటల్లో మరియు ప్రవర్తనలో దురభిమానంతో ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను ఎన్నటికీ ఆత్మ శక్తిని అనుభూతి చేయలేను ఎందుకంటే దురభిమానంతో ఉన్న వ్యక్తి గురించి ఎవరైనా ఏదైనా అంటే తొందరగా అవమానాన్ని ఫీల్ అవుతాడు. గర్వంతో ఉన్న వ్యక్తి మాటలలో చేదును, విమర్శను ప్రదర్శిస్తూ ప్రేమ మరియు జ్ఞానంలో లోటు కలిగి ఉంటాడు.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »